TS Rythu Bandhu Updates 2022
అన్నదాతలకు గుడ్ న్యూస్.. త్వరలోనే రైతుబంధు..
రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే రైతుబంధు నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ, ఆర్థిక శాఖలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి బుధవారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని రైతు బంధు సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. గత యాసంగిలో 63 లక్షల మంది రైతులకు రూ.7,411 కోట్లను అందించారు.
ఈ వానాకాలం పంట పెట్టుబడికి రైతుబంధు(rytu bandhu) నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) నిర్ణయించారు. ఈనెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖయమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటి లాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాలలో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమచేయనుంది.