Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS TET Hall Ticket 2023

త్వరలో తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల..! తాజా సమాచారం ప్రకారం..

 

 

తెలంగాణలో సెప్టెంబర్‌ 15న టెట్‌ (Teacher Eligibility Test) పరీక్షను నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు కూడా త్వరలో విడుదలకానున్నాయి.

 

 

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతోంది. త్వరలో డీఎస్సీ (TRT) నోటిఫికేషన్‌ కూడా విడుదలకానుంది. గతేడాది టెట్ పరీక్ష నిర్వహించిన విద్యాశాఖ.. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుందని అంతా భావించారు. కానీ అప్పుడు నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. అయితే.. ఇటీవల 6వేలకు పైగా టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి TS TET 2023 పరీక్ష కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఇప్పటికే TS TET 2023 దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. త్వరలో TS TET 2023 హాల్‌టికెట్లు విడుదల చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. పరీక్ష వారం రోజుల ముందు (సెప్టెంబర్‌ 9)న విడుదల చేసే అవకాశం ఉంది.

 

 

సెప్టెంబర్‌ 15న రెండు షిఫ్టుల్లో పరీక్ష :
సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలను నిర్వహించనున్నారు. ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. తుది ఫలితాలను సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షనను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నారు.

 

 

ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం.. డీఎడ్‌, బీఎడ్‌ పాసైన వారు టెట్‌లో ఉత్తీర్ణులైతేనే ఉపాధ్యాయుల నియామకానికి నిర్వహించే టీఆర్‌టీ (TRT) పరీక్ష రాయడానికి అర్హులవుతారు. టెట్‌లో వచ్చిన మార్కులకు టీఆర్‌టీ ర్యాంకింగ్‌లో 20 శాతం వెయిటేజీ ఉన్నందున టెట్‌లో అత్యధిక మార్కులు దక్కించుకోవడానికి అభ్యర్థులు పోటీపడుతుంటారు. టెట్ లో అర్హత లేకపోతే ఈ పరీక్షలకు హాజరుకాలేరు. పైగా టెట్ ఉత్తీర్ణత లేకపోతే ప్రైవేటు పాఠశాలల్లో కూడా బోధన చేయడానికి వీలుండదు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

 

 

 

 

 

 

Related Articles

Back to top button