TS TET Results 2023
టీఎస్ టెట్-2023 ఫలితాలు..
తెలంగాణ ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TET) ఫలితాలను ఈ సారి అత్యంత త్వరగా ఫలితాలను విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించిన టీఎస్ టెట్ 2023 పరీక్షకు సంబంధించిన ఫలితాలను..సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ ఫలితాలను కేవలం 12 రోజుల వ్యవధిలోనే విడుదల చేయనున్నారు. ఇందుకు కోసం అధికారులు సన్నాహాలను పూర్తి చేశారు. ఈ ఫలితాలను https://tstet.cgg.gov.in/ లో చూడొచ్చు.
ఫలితాల కోసం.. 4,35,242 మంది ఎదురు చూపు..
సెప్టెంబర్ 15న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1కు 2,69,557 మంది, పేపర్-2కు 2,08,498 మంది చేసుకున్నారు. టీఎస్ టెట్ పేపర్-1 పరీక్షను 2,26,744 (84.12శాతం) రాశారు. బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్-2 పరీక్షను 91.11 శాతం మంది రాశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరుగగా.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్ష నిర్వహించింది.
పేపర్-1కు 2 లక్షల 69 వేల 557 మంది దరఖాస్తు చేయగా.. 1139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ టూ 2 లక్షల 8 వేల 498 రాయగా.. 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్లో క్వాలిఫై కావడం తప్పనిసరి అని తెలిసిందే.