TSPSC Exam Rescheduled 2023
టీఎస్పీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు.. సెప్టెంబర్ లో పరీక్షలు..
టీఎస్పీఎస్సీలో మునెపెన్నడూ లేని విధంగా పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. దాని దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి.
టీఎస్పీఎస్సీలో మునెపెన్నడూ లేని విధంగా పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. దాని దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. ఇక ఈ విచారణకు సంబంధించిన నివేదికను ఇటీవల హైకోర్టుకు సిట్ అందజేశారు. అరెస్టులు, కస్టడీ ఆ తరువాత జరిగిన పరిణామాలన్నింటిని కూడా సిట్ ఆ నివేదికలో పేర్కొంది. అయితే.. ఈ మధ్యలో టీఎస్పీఎస్సీ నిర్వహించాల్సిన పరీక్షలు అన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. మార్చి 05న నిర్వహించిన పరీక్ష చివరిది కాగా.. మార్చి 12న నిర్వహించాల్సిన టీపీబీఓ(TPBO) పరీక్షను కూడా వాయిదా వేశారు. అయితే రద్దైన పరీక్షలు 4 ఉండగా.. వాటిలో మూడు పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించారు. డీఏఓ పరీక్షకు సంబంధించి మాత్రం కొత్త తేదీలు ఖరారు కాలేదు. ఇక ఇప్పటికే చాలా వరకు నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేశారు. తాాజాగా రీషెడ్యూల్ చేసిన రెండు పరీక్షలకు సంబంధించి పరీక్ష తేదీలను మరోసారి మర్చారు. వాటి పరీక్షల తేదీలను సెప్టెంబర్ లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. దానిలో..
వీటికి మే 13న పరీక్ష నిర్వహించనున్నట్లు ఇటీవల టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీనిని తాజాగా ప్రకటించిన వెబ్ నోట్ లో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.