TSPSC GROUP-1 Jobs || గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. ఇక ఆ టెన్షన్ అసవరం లేదు
తెలంగాణలో ఉద్యోగాల సందడి నెలకొన్న విషయం తెలిసిందే. వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతుండడంతో నిరుద్యోగులు పెద్ద మొత్తంలో అప్లై చేస్తున్నారు. ముఖ్యంగా గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గ్రూప్-1 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ శుభవార్త చెప్పింది.
తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే బోనఫైడ్ తప్పనిసరా? ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడెక్కడ చదివారో ఆ స్కూళ్ల నుంచి బోనఫైడ్స్ తీసుకురావాల్సిందేనా? దీనిపై టీఎస్పీఎస్సీ క్లారిటీ ఇచ్చింది.
గ్రూప్-1 దరఖాస్తుకు బోనఫైడ్ అవసరం లేదని టీఎస్ పీఎస్సీ తెలిపింది. విద్యార్హతల సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పిం చనున్న నేపథ్యంలో 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివారన్నది మాత్రమే ముఖ్యమని తెలిపింది.
కానీ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో దరఖాస్తులో తెలిపిన వివరాలు వేరుగా ఉంటే చట్టపర చర్యలు తప్పవని టీఎస్పీఎస్సీ హెచ్చరించింది. బోనఫైడ్ సర్టిఫికెట్‌కు బదులుగా లోకల్ ఏరియా లేదా ఇతర సర్టిఫికెట్లు చూపిస్తే సరిపోతుందని కొందరు భావిస్తున్నారని, అది అపోహేనని టీఎస్పీఎస్సీ స్పష్టంచేసింది.
బోనఫైడ్స్తో పాటు టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా 040- 22445566ను సంప్రదించాలని తెలిపింది. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే helpdesk@tspsc.gov.in ద్వారా చేసుకోవచ్చని వివరించింది.