Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

AP Anganwadi Jobs 2023 || wdcw

 

 

 

 

 

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పలు జిల్లాల్లో తరచూ అంగన్ వాడీ లో ఉద్యోగాల భర్తీ జరుగుతుంటుంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలోని వివిధ‌ అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో 25 వ‌ర్క‌ర్లు, హెల్ప‌ర్లు, మినీ అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.

 

 

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పలు జిల్లాల్లో తరచూ అంగన్ వాడీ లో ఉద్యోగాల భర్తీ జరుగుతుంటుంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలోని వివిధ‌ అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో 25 వ‌ర్క‌ర్లు, హెల్ప‌ర్లు, మినీ అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్టు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి బి.శాంతకుమారి తెలిపారు.

 

ఉద్యోగాలు , ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు” width=”1600″ height=”1600″ /> నాలుగు అంగ‌న్‌వాడి కార్య‌క‌ర్త‌లు, 17 హెల్ప‌ర్‌, 4 మినీ అంగ‌న్‌వాడీల్లో కార్య‌క‌ర్త‌ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.బాడంగి, చీపురుప‌ల్లి, గ‌రివిడి, గంట్యాడ ప్రాజెక్టుల్లో ఒక్కో అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త పోస్టు భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు.

 

 

హెల్ప‌ర్ పోస్టులు బొబ్బిలిలో 2, చీపురుప‌ల్లిలో 2, గ‌రివిడిలో 3, రాజాంలో 2, వియ్యంపేట‌లో 3, విజ‌య‌న‌గ‌రంలో 5 ఖాళీల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్టు తెలిపారు.మిని అంగ‌న్‌వాడీల్లో కార్య‌క‌ర్త‌ల పోస్టులు బాడంగిలో 1, బొబ్బిలిలో 2, గ‌జ‌ప‌తిన‌గ‌రంలో 1, చీపురుప‌ల్లిలో 3, గ‌రివిడిలో 4, రాజాంలో 3, ఎస్‌.కోట‌లో 1, వియ్యంపేట‌లో 3, గంట్యాడ‌లో 1, భోగాపురంలో 1, విజ‌య‌న‌గ‌రంలో 5 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

 

అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్ధులు క‌నీసం 10వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై వుండాల‌ని, అందులోనూ తెలుగు స‌బ్జెక్టులో ఉత్తీర్ణులు కావ‌డంతో పాటు తెలుగులో వ్రాయ‌డం, చ‌ద‌వడం తెలిసి వుండాల‌ని పేర్కొన్నారు. అభ్య‌ర్ధుల వ‌య‌స్సు జూలై 1, 2023 నాటికి 21 నుంచి 35 సంవ‌త్స‌రాల మ‌ధ్య వుండాల‌ని తెలిపారు.

 

 

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్ధులు ఆ గ్రామ స్థానిక వివాహిత అయి వుండాల‌ని పేర్కొన్నారు. రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్‌ను అనుస‌రించి సంబంధిత ఖాళీల‌కు కేటాయించిన కేట‌గిరీ అభ్య‌ర్ధులు మాత్ర‌మే ఆయా పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌ల‌సి వుంటుందన్నారు.

 

అర్హులైన ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్ధులు జూలై 22వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌లోగా సంబంధిత ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో త‌మ ద‌ర‌ఖాస్తులు అంద‌జేయాల‌న్నారు.

 

 

 

 

 

 

Related Articles

Back to top button