TSPSC Group 4 Results 2023
అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్ 4 కీ, ఫలితాలపై తాజా అప్ డేట్..
తెలంగాణలో జులై 1న గ్రూప్-4 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 8 వేల180 గ్రూప్-4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి మెుత్తం 9.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణలో జులై 1న గ్రూప్-4 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 8 వేల180 గ్రూప్-4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి మెుత్తం 9.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
దీని కోసం 2878 ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ 4 పేపర్-1 జనరల్ స్టడీస్ కు 7,62,872 మంది హాజరు కాగా.. పేపర్-2 సెక్టరేరియల్ ఎబిలిటీస్ కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
దాదాపు ఈ పరీక్షకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరయినట్లు అధికారులు తెలిపారు. అయితే పరీక్ష జరిగి 50 రోజులు అవుతున్నా ప్రాథమిక కీని విడుదల చేయలేదు. అయితే ఇటీవల రేపో మాపో ప్రాథమిక కీని విడుదల చేస్తారనే ప్రచారం జరిగినా ప్రాథమిక కీ విడుదల కాలేదు.
. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ గ్రూప్ 4 ఫలితాల విడుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూప్–4 ఫలితాలకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి చెప్పారు. కమిషన్లో సిబ్బంది తక్కువగా ఉన్నారని తెలిపారు. టీఎస్పీఎస్సీలో 80 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 40 మంది సెలవుల్లో ఉన్నారని తెలిపారు.
యూపీఎస్సీలో 2వేల మంది ఉంటారని వివరించా రు. గ్రూప్–4 8లక్షల మందికి పైగా అభ్యర్థులు రాశారని.. వారికి సంబంధించిన 17 లక్ష ల పేపర్లున్నాయని వెల్లడించారు. ఇక టీఎస్పీఎస్సీలో చిన్న చిన్న సమస్యల కారణంగా.. వ్యవస్థనే తప్పుపట్టడం కరెక్ట్ కాదని విలేకరులతో నిర్వహించిన చిట్ చాట్ లో పేర్కొన్నారు.
వారం రోజులు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ మొదటి వారంలో అభ్యంతరాలకు సంబంధించి కీపై నిపుణుల కమిటీ వేయనున్నారు. దీని తర్వాత ఫైనల్ కీ విడుదల చేస్తారు. ఇదంతా సెప్టెంబర్ లో పూర్తి అయితే.. అక్టోబర్ మొదటి వారంలో గ్రూప్ 4 ఫలితాలు విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను https://www.tspsc.gov.in/ సందర్శించండి.