Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
WDCW JOS IN AP 2023
అంగన్వాడీల్లో 243 పోస్టులు IN AP
రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
61 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో), అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో), మహిళా–శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు, 161 గ్రేడ్–1 సూపర్వైజర్ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.