Anganwadi Notification 2022
Anganwadi Teachers Notification
గుడ్ న్యూస్.. అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
Anganwadi Notification 2022: ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ నుంచి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
అనంతపురం అర్బన్ లో 03, గూటీలో 10, కనేకల్ లో 11, కళ్యాణ్ దుర్గ్ లో 04, కంబదూర్ 10, కుడేరులో 09, రాయదుర్గ్ లో 06, సింగనమల లో 11, తాడిపత్రిలో 08,ఉరవకొండలో 08 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. దీని కోసం అభ్యర్థులు https://ananthapuramu.ap.gov.in/ వెబ్ సైట్ సందర్శించి దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ వెబ్ సైట్ లోనే నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ డిసెంబర్ 16, 2022న విడుదల అయింది. నోటిఫికేషన్ విడుదలైన వారం రోజుల్లోగా అభ్యర్థులు దరఖాస్తులను అనంతపురం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమాధికారికి పంపించాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తులను డిసెంబర్ 24 లోపు పంపించాలి.