Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Anganwadi Notification 2022

Anganwadi Teachers Notification

 

 

 

 

 

గుడ్ న్యూస్.. అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

 

 

Anganwadi Notification 2022: ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

 

 

మొత్తం పోస్టులు 80 ఖాళీగా ఉన్నాయి. వీటిలో అంగన్ వాడీ టీచర్ పోస్టులు 20, అంగన్ వాడీ హెల్పర్ పోస్టులు 60 ఉన్నాయి. అంగన్ వాడీ కార్యకర్త పోస్టులకు నెలకు రూ.11, 500 చెల్లిస్తారు. హెల్పర్ పోస్టులకు రూ.7000 చెల్లించనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా.. ఏ గ్రామ పరిధిలో ఈ పోస్టు ఖాళీగా ఉందో.. ఆ సొంత పంచాయతీ నందు నివసిస్తూ ఉండాలి. వివాహితులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్ కు కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్ వంటి డాక్యుమెంట్స్ ల జిరాక్స్ పత్రాలను జత చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే తప్పనిసరిగా టి.సి / స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button