Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS TET Notification PDF 2023

Teachers eligibility recruitment full details 2023

 

 

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ ఏడాది సెప్టెంబరు 15న టెట్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

 

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ ఏడాది సెప్టెంబరు 15న టెట్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)కు ఎదురు చూస్తున్న అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్లుగా ఉపాఽధ్యాయ నియామకాలే చేపట్టలేదు. గతేడాది ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించినా టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. టీఆర్‌టీ నిర్వహించ కుండా మరోసారి టెట్‌ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా టెట్‌ నోటిఫికేషన్‌ను మంగళవారం విడుల చేసింది. ఈ నెల 16 వరకు టెట్‌ అర్హత అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. డీఈఐఈడీ, డీఈడీ, బీఈడీ, లాంగ్వేజ్‌ పండిట్‌లు టెట్‌ రాయడానికి అర్హులు. పరీక్ష రాసే వారికి రూ.400 ఫీజు నిర్ణయిం చింది. సెప్టెంబరు 9న హాల్‌టికెట్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవడం, సెప్టెంబరు 15న మొదటి పేపర్‌ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పేపర్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఫలితాలను 27న వెల్లడిస్తారు. జనరల్‌ అభ్యర్థులు 60 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధిస్తే టీఆర్‌టీకి అర్హత సాధిస్తారు. ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న వారు టెట్‌ నోటిఫికేషన్‌ వెలువడడంతో హర్షం వ్యక్తం చేస్తుండగా టీఆర్‌టీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

గతేడాది టెట్‌కు 12,781 మంది

మరో నాలుగు నెలల్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలోనే టెట్‌ నోటిఫికేషన్‌తో నిరుద్యోగ యువకుల్లో ఆశలు రేపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2015లో ఉపాధ్యాయ నియామకాల కోసం టెట్‌ నిర్వహించారు. రెండేళ్ల తరువాత 2017లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారు. ఆ తరువాత ఉపాధ్యాయ నియామకాల జోలికి వెళ్లలేదు. దాదాపు ఏడేళ్లు గడుస్తున్నాయి. అదే సమయంలో టెట్‌ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఊరట ఇస్తూ 2022 జూన్‌ 12న టెట్‌ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 12,781 మంది పరీక్షకు హాజరు కాగా 80 శాతం వరకు అభ్యర్థులు అర్హత సాధించారు. సంవత్సరానికి రెండు సార్లు టెట్‌ నిర్వహించాల్సి ఉండగా ఏడాది తరువాత పరీక్ష నిర్వహించడానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. రాష్ట్రం లో రెండు మల్టీజోన్‌లు ఉండగా మొదటి మల్టీ జోన్‌లో కాళేశ్వరం, బాసర, రాజన్న జోన్‌లు ఉన్నాయి. రాజన్న జోన్‌లో కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. గత సంవ త్సరం ఉద్యోగ ఖాళీల్లో రాజన్న జోన్‌లో 2,403 ఖాళీలు ఉండగా జిల్లాలో 601 పోస్టులు ఖాళీ ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 534 పాఠశాలలు ఉండగా 52,450 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగు పరుస్తున్నా ఉపాధ్యాయ ఖాళీలు మాత్రం భర్తీ చేయడం లేదు. జిల్లాలో 2,352 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా 1979 మంది పనిచేస్తున్నారు. 373 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 126 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 200 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై ఇతర స్కూళ్లకు పంపించి విద్యాబోధన సాగిస్తున్నారు.

 

క్వాలిఫై అభ్యర్థుల్లో నిరాశ..

జిల్లాలో బీఈడీ, డీఈడీ, చేసి టెట్‌ క్వాలీఫై అయిన అభ్యర్థులు ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్‌టీ కోసం ఎదురు చూస్తున్నారు. టీఆర్‌టీ నిర్వహించకుండా టెట్‌ నిర్వహించడంపై అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. టెట్‌తోపాటు టీఆర్‌టీ ఏకకాలంలో నిర్వహించాలని క్వాలిఫై అభ్యర్థుల నుంచి డిమాండ్‌ మొదలైంది. ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ప్రభుత్వ కొలువు కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు నాలుగైదు సంవత్స రాలుగా ఎదురు చూస్తున్నావారు కూడా ఉన్నారు. ఈసారి టెట్‌ తర్వాత కూడా వెంటనే టీఆర్‌టీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉండదనే భావిస్తున్నారు. ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ రానుండడంతో మళ్లీ ఎదురు చూపులే మిగులుతాయని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

Related Articles

Back to top button