Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
TS August Month Exams 2023
ఆగస్ట్‌లో నిర్వహించనున్న ప్రభుత్వ పరీక్షల తేదీలు ఇవే...
August Month Exams
వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించనున్న పరీక్ష తేదీలు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే ఒకేరోజు రెండు, మూడు పరీక్షలను నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీలు నిర్వహించిన పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఏఓ, జేఏఓ, సీనియర్ అకౌంటెంట్ పరీక్ష కోసం నిర్వహించనున్న పరీక్ష ఈ నెల 8వ తేదీ జరగనుంది. అలాగే టీఎస్పీఎస్సీ నిర్వహించనున్న వెటర్నరీ ఆఫీసర్ రాత పరీక్ష 13వ తేదీ జరగనుంది.
ఇక బ్యాంకు ఉద్యోగాల భర్తీ కోసం ఐబీపీఎస్ నిర్వహించనున్న స్కేల్ 1 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ ప్రాథమిక పరీక్షలు 12, 13, 19వ తేదీల్లో జరగనున్నాయి.
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష 26, 27, సెప్టెంబర్ 2వ తేదీల్లో జరగనున్నాయి.