All India level State wise government jobs 2023 || AP, TS circle government job updates 2023
Latest Government Jobs Notifications 2023
SSC Recruitment 2023: నిరుద్యోగులకి శుభవార్త.. SSC నుంచి మరో భారీ నోటిఫికేషన్.. 30 ఏళ్లవారు కూడా అర్హులే..!
SSC Recruitment 2023
నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికింద కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5369 పోస్టులని భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ssc.nic.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 7,914 ఉద్యోగాలకు నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో ఉద్యోగం పొందే అవకాశాన్ని ఇండియన్ రైల్వే (Indian Railway) అందజేస్తోంది. గ్రూప్ డి పోస్టుల ప్రకటన అనంతరం మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా 7,914 ఖాళీలను భర్తీ చేయనుంది.
దేశంలోనే ఎక్కువ మంది ఇండియన్ రైల్వేలో (Indian Railways) ఉపాధి పొందుతున్నారు. రైల్వేలో ఉద్యోగం కోసం చాలా మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు. అలాంటి వారికి ఇప్పుడు పదో తరగతి అర్హతతో ఉద్యోగం పొందే అవకాశాన్ని ఇండియన్ రైల్వే అందజేస్తోంది. గ్రూప్ డి పోస్టుల ప్రకటన అనంతరం మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా 7,914 ఖాళీలను భర్తీ చేయనుంది. సౌత్ సెంట్రల్ రైల్వే (SCR), సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER), నార్త్ వెస్టర్న్ రైల్వే(NWR) జోన్ల పరిధిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఏ జోన్ పరిధిలో ఎన్ని ఖాళీలున్నాయి? ఎవరెవరు అర్హులు? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హతలు
విద్యార్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి పదో తరగతి పాసై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్(NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్(SCVT) ధ్రువీకరించిన ఐటీఐ ఉత్తీర్ణత సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.
వయసు: రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొన్న వివరాల ప్రకారం.. 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023, జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 24 ఏళ్లు మించకూడదు. అదే విధంగా 15 ఏళ్లు తగ్గకుండా ఉండాలి. రిజర్వ్డ్ అభ్యర్థులకు వయసు మినహాయింపు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని కొత్త జిల్లాల్లో మండల, జిల్లా స్థాయి పోస్టులతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగేలోగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్, పదోన్నతులు, ఇన్చార్జి బాధ్యతల అప్పగింత ద్వారా త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.
ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి కార్యదర్శులకు సూచించారు. ఫిబ్రవరి 16వ తేదీన (గురువారం) రాష్ట్ర సచివాలయం ఐదవ బ్లాకు కలెక్టర్ల సమావేశ మందిరంలో సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం జరిగింది.
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగు పరచడం, అధికారాల బదిలీ, కలెక్టర్లతో వీడియో సమావేశాల్లో వచ్చిన అంశాలపై ఫాలోఅప్ చర్యలు, అసెంబ్లీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ ఎల్ఏక్యూ, ఎల్సీక్యూలపై సత్వరం సమాచారం అందించడం, తదితర అజెండా అంశాలపై సీఎస్ కార్యదర్శులతో సమీక్షించారు.
► ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1, 2స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ–ఆఫీస్ విధానం కింద ఇ–రశీదులు, ఇ–డిస్పాచ్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
► గతంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన డిమాండ్లలో ఆర్థికేతర అంశాలకు సంబంధించిన డిమాండ్లను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇందులో భాగంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1,2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెల్సిందే. అలాగే సీడీపీఓ 63 ఉద్యోగాలకు భర్తీకి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ సీడీపీఓ ఉద్యోగాలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఇదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం అయింది. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.
IMPORTANT LINKS
1) INDIAN RAILWAY TTE RECRUITMENT
2) DSSSB RECRUITMENT
3) AADARSH VIDYALAY SANGATHAN
4) INDIAN BANK RECRUITMENT
5) ESIC RECRUITMENT
6) ICSIL RECRUITMENT
7) INDIAN RAILWAY RECRUITMENT 2023
8) INDIAN POSTAL RECRUITMENT
9) SSC CGL RECRUITMENT
10) UPSC CAPF RECRUITMENT
11) DELHI POLICE RECRUITMENT
12) UPSC CMS RECRUITMENT
13) BSNL RECRUITMENT
14) FCI RECRUITMENT
15) ICDS ANGANBADI RECRUITMENT