Indiramma Housing Scheme 2025
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్.. వారికి మాత్రమే మొదటిగా ఇళ్లు.. ప్రభుత్వం కీలక ప్రకటన?
Indiramma Housing Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రాష్ట్రంలోని ఇళ్లు లేని పేదలు ఇందిరమ్మ ఇళ్లు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇంటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు సంక్రాంతి తర్వత ఇస్తామని ప్రకటించగా.. తాజాగా వీటిపై మరో కీలక ప్రకటన చేసింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక ప్రకటనే చేశారు. తాజాగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా సర్వే కొనసాగుతుందన్నారు. ఈ సర్వేను త్వరలో పూర్తి చేసి జనవరి 31లోపు ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేస్తామని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ పథకంలో తొలి విడతలో అత్యంత పేదలకు ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ, ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుత దశలో సొంత స్థలం ఉన్న వారికి పథకాన్ని ప్రారంభించనున్నారు. అర్హుల గుర్తింపునకు గ్రామాలు, పట్టణాల్లో సర్వే కొనసాగుతోంది. సర్వేలో సేకరించిన వివరాలను ఇందిరమ్మ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
సోమవారం హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి, లబ్ధిదారుల ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశారు. పథకం కోసం దరఖాస్తు చేసిన వారిలో అత్యంత పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని, జనవరి 31లోగా వాటి పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలో అర్హులందరికీ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
పథకం అమలులో పారదర్శకతను కొనసాగించేందుకు గ్రామసభల ద్వారా లబ్ధిదారుల జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాను ఇందిరమ్మ కమిటీలు సిద్ధం చేసి, ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపుతారు. అనంతరం, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల ఆమోదంతో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ప్రభుత్వం రూ. 5 లక్షల సాయాన్ని నాలుగు దశల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇవి పూర్తిగా మహిళల పేరుతోనే మంజూరు చేయబడతాయి.
తొలి దశలో సొంత స్థలం ఉన్నవారికి మాత్రమే ఇండ్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. తర్వాత దశలో స్థలం లేదని నిర్ధారణ అయిన వారికి ఇంటిని నిర్మించేందుకు ప్రభుత్వ సాయం అందిస్తామని ప్రకటించింది.
ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ అనే మూడు కీలక పథకాలను ప్రభుత్వం అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు పథకంతో పేదలకు గృహాలను అందించడమే కాకుండా, ఆర్థిక భద్రత కల్పించాలని ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందరికీ ఇండ్లు కల్పించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా వినూత్న చర్యలు చేపట్టింది.