Jobs 2023
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో జూనియర్ గెస్ట్ లెక్చరర్లుగా పని చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన విద్యాలయాల సంస్థ నల్లగొండ రీజియన్ అధికారి కె.లక్ష్మయ్య ఆగస్టు 23న ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంగ్లిష్ 03, ఫిజిక్స్ 03, కెమిస్ట్రీ ఒకటి, పీజీటీ ఇంగ్లిష్ 03, మ్యాథ్స్ ఒకటి, పిజికల్ సైన్స్ ఒకటి, ఫిజికల్ డైరెక్టర్ రెండు పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నట్లు వివరించారు. ఇంగ్లిష్ మీడియంలో బోధించాల్సి ఉంటుందని ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 26న సాయంత్రం 5గంటల వరకు నల్లగొండ గిరిజన విద్యాలయాల సంస్థ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లతో సమర్పించాలని సూచించారు. ఆగస్టు 28వ తేదీన కార్యాలయంలోనే డెమో, ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈఅవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.