Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TS SI, Constable Cut off Marks 2022

పండగ వేళ పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. కటాఫ్ మార్కులు ఎంత తగ్గాయంటే?

 

 

 

 

 

 

 

TS Constable Cut off Marks: తెల్లారితే బతుకమ్మ పండుగ సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ అభ్యర్థులకు శుభవార్త వినిపించింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. ప్రాథమిక పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులను సవరిస్తూ.. పోలీస్ నియామక మండలి జీవో జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 20 శాతం మార్కులను కేటాయిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఈ జీవోతో పోలీస్ అభ్యర్థుల్లో పండగ సంతోషం రెట్టింపయ్యింది.

 

 

 

TS Constable Cut off Marks: పోలీసు ఉద్యోగార్థులకు తెలంగాణ (Telangana) ప్రభత్వం ఇచ్చిన మాట ప్రకారం.. కటాఫ్ మార్కులను తగ్గిస్తూ.. జీవో విడుదల చేసింది. ఇటీవల జరిగిన పోలీస్ నియామక పరీక్ష (SI, Constable Preliminary exams) ల్లో అన్ని కేటగిరీల అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలో 60 మార్కులు కేటాయించడంపై తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తగా.. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ (KCR) సంచలన ప్రకటన చేశారు. పోలీసుల అర్హత పరీక్షలో కటాఫ్ మార్కులు (Constable cut off marks telangana 2022) తగ్గిస్తామని వెల్లడించారు. అయితే.. ఈ వెసులుబాటు కేవలం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని కూడా స్పష్టం చేశారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. నేడు తెలంగాణ పోలీస్ నియామక మండలి దీనిపై నిర్ణయం తీసుకుంది. కటాఫ్ మార్కులను సవరిస్తూ జీవో జారీ చేసింది.

 

 

సవరించిన జీవో ప్రకారం.. ఓసీ అభ్యర్థులకు 30 శాతం, బీసీ అభ్యర్థులకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 20 శాతం మార్కులను కేటాయిస్తున్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అధికారులు నోటీస్ జారీ చేశారు. దీని ప్రకారం.. 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 60 మార్కులు, బీసీ అభ్యర్థులకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 మార్కులు వస్తే.. ఉత్తీర్ణులవుతారు. తర్వాత నిర్వహించబోయే.. శారీరధారుడ్య పరీక్షలకు అర్హత పొందుతారన్నమాట.

 

 

గతంలో జరిగిన పోలీసు నియామక పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు 30 శాతంగా.. బీసీలకు 35 శాతంగా.. ఓసీలకు 40 శాతంగా ఉండేవి. కానీ.. ఈసారి సామాజికవర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30 శాతం మార్కులనే అర్హతగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పరీక్షలో 200 ప్రశ్నలకు గానూ… 60 మార్కులు వస్తే సరిపోతుంది. మళ్లీ ఇందులో నెగెటివ్‌ మార్కులు కూడా ఉంటాయి. దీని ప్రకారం.. ఓసీలకు 10 శాతం, బీసీలకు 5 శాతం సడలింపు ఇచ్చినట్టయింది. దీంతో.. తమకు ఎలాంటి సడలింపు ఇవ్వలేదని ఎస్సీ, ఎస్టీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని నిరసనలు వ్యక్తం చేయగా.. ప్రభుత్వం స్పందించి జీవోను సవరించింది.

 

 

తెలంగాణలో 554 ఎస్సై పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా ఏకంగా 2,47,217 దరఖాస్తులు వచ్చాయి. ప్రిలిమినరీ పరీక్షకు 91.32 శాతం అంటే.. 2,25,759 మంది పరీక్ష రాశారు. మరోవైపు 16,321 కానిస్టేబుల్ పోస్టుల కోసం ఏకంగా 6,61,198 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 91.34 శాతం అంటే 6,03, 955 మంది ప్రిలిమినరీ పరీక్ష రాశారు.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button