Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

APPSC : APPSC group 1 and 2 notifications at the end of this month..?

APPSC : ఈ నెలాఖరులో ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, 2 నోటిఫికేషన్లు..?

 

 

AP Government Jobs : ఏపీలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 ఉద్యోగాల భర్తీకి ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. నోటిఫికేషన్ల విడుదలకు కసరత్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ కమ్రంలో..

ఆంధ్రప్రదేశ్‌లో లక్షల మంది అభ్య‌ర్థులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచుస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్య‌మంత్రి ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు.. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నట్లు సమాచారం. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

 

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులను.. అలాగే గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులతో క‌లిపి మొత్తంగా.. 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని ఇటీవల అధికారులు తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

 

అలాగే.. ఆంధ‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన కొత్త సిల‌బ‌స్‌ను ఏప్రిల్ 27వ తేదీన విడుద‌ల చేసింది. అలాగే ఈ సారి గ్రూప్‌-2 దాదాపు 900 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ కొత్త సిల‌బ‌స్ ప్ర‌కారం.. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాతపరీక్షల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్ పరీక్ష రాయడానికి అర్హులు.

 

సవరించిన సిలబస్ మరియు పరీక్షా సరళి ప్రకారం.. 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్ అండ్‌ మెంటల్ ఎబిలిటీని మాత్రమే కలిగి ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో జనరల్ స్టడీస్ మినహాయించబడింది. ఇది ఇప్పటికే ఉన్న స్కీమ్‌లో మూడింటికి బదులుగా ఒక్కొక్కటి 150 మార్కులకు రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. ఇక ప‌రీక్ష స‌మ‌యం 150 నిమిషాలుగా ఉండనుంది.

 

 

 

Related Articles

Back to top button