PM Kisan 13th Installment 2023
రైతుల అకౌంట్లలోకి డబ్బులు.. జనవరి 28లోపు ఇలా చేస్తేనే..
PM Kisan Scheme | పీఎం కిసాన్ రైతులకు అలర్ట్. మీరు కచ్చితంగా ఇకేవైసీ చేసుకోవాల్సిందే. ఎవరైతే ఇకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే పీఎం కిసాన్ 13వ విడత డబ్బులు వస్తాయి. లేని వారికి ఈ డబ్బులు రావు.
PM Kisan Samman Nidhi | రైతులకు అలర్ట్. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డబ్బులు పొందే అన్నదాతలు కచ్చితంగా ఇకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా చేయకపోతే మాత్రం రైతులకు డబ్బులు రావు. అందుకే మీరు ఇంకా ఇకేవైసీ పూర్తి చేసుకోకపోతే వెంటనే ఆ పని చేసేయండి.
పీఎం కిసాన్ ఇకేవైసీ చేయని రైతులు జనవరి 28 కల్లా ఆ పని పూర్తి చేసుకోవాలి. ఎవరైతే ఇలా ఇకేవైసీ చేసుకున్నారో అలాంటి రైతులకు మాత్రమే పీఎం కిసాన్ 13వ విడత డబ్బులు వస్తాయి. కేవైసీ చేసుకోకపోతే మాత్రం ఆ డబ్బులు రావు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు పీఎం కిసాన్ ఇకేవైసీ గడువును పొడిగిస్తూ వచ్చింది. అందువల్ల మీరు మీర ఇంకా ఇకేవైనీ చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయండి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 12 విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 13వ విడత డబ్బులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగకే పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తుందని నివేదికలు వెలువడ్డాయి. అయితే డబ్బులు ఇంకా రాలేదు.
అందువల్ల త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రైతులు అందరూ కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఎవరైతే పీఎం కిసాన్ స్కీమ్ కింద లబ్ధి పొందుతున్నారో వారందరికీ ఇది వర్తిస్తుంది. ఇకేవైసీ చేసుకోకపోతే మాత్రం డబ్బులు రావని చెప్పకోవాలి.
పీఎం కిసాన్ వెబ్సైట్లోకి ఓటీపీ ఆధారంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ కార్డు నెంబర్, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. మీరు సులభంగానే ఇకేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. లేదంటే దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లినా కూడా ఇకేవైసీ చేసేస్తారు.
బీహార్ గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకేవైసీ చేసుకోవాలని కోరింది. ఎవరైతే ఇకేవైసీ చేసుకోరో వారికి పీఎం కిసాన్ డబ్బులు రావని తెలిపింది. జవనరి 28 లోగా ఇకేవైసీ చేసుకోవాలని సూచించింది.
కాగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా రైతులకు రూ. 6 వేలు అందిస్తోంది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా రూ. 2 వేల చొప్పున అన్నదాత బ్యాంక్ ఖాతాలో జమ అవుతోంది. అంటే ఏడాదికి మూడు సార్లు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయని చెప్పుకోవచ్చు. నాలుగు నెలలకు ఒకసారి పీఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయి.