Teacher Jobs 2023-24
283 టీచర్ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్
సర్దుబాటుతో వెళ్ల దీస్తూ
జిల్లాలోని 1,265 పాఠశాలలకు గానూ అనేక చోట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం జిల్లావ్యాప్తంగా 220 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేవలం ఒకసారి మాత్రమే టీఆర్టీ ప్రకటన విడుదలైంది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేపట్టిన ఫలితం లేకపోయింది.
ఏళ్లుగా నిరీక్షణ
గతంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన 2017లో టీఆర్టీ నిర్వహించారు. ఆ తరువాత ఉపాధ్యాయ నియామకాలు లేకపోవడంతో ప్రభుత్వం ఎలాగైన టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందనే ఆశతో ప్రతి సంవత్సరం బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. టీఆర్టీ పరీక్ష రాయాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అర్హత సాధించాల్సి ఉండడంతో ప్రభుత్వం ఇటీవల టెట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. సెప్టెంబర్ 15న టెట్ అర్హత పరీక్ష, ఫలితాలు 27న ప్రకటించనుంది.
ఉపాధ్యాయ ఖాళీల వివరాలు
- పోస్టులు ఖాళీలు భర్తీ చేస్తున్నవి
- ఎస్ఏ 286 80
- ఎస్జీటీ 385 174
- ఎల్పి 24 24
- పీఈటీ 5 5
- మొత్తం 682 283