Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News
TS SSC Results 2022 Date Announced…
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజే పది పరీక్ష ఫలితాలు..
తెలంగాణ పది తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కాలేజీలు, పాఠశాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. పది, ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే పది ఫలితాల విడుదలకు విద్యాశాఖ అధికారుల నుంచి స్పష్టత వచ్చింది.
పది పరీక్షా ఫలితాలను జూన్ 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు గత నెల 23 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ క్రమంలో జూన్ 25న టెన్త్ ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.