Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News
TS TET 2022 || డైలమాలో టెట్ అభ్యర్థులు.. అదే రోజు మరో ఉద్యోగ పరీక్ష.. టెట్ పరీక్ష తేదీ మార్పుకై అభ్యర్థన..
డైలమాలో టెట్ అభ్యర్థులు.. అదే రోజు మరో ఉద్యోగ పరీక్ష.. టెట్ పరీక్ష తేదీ మార్పుకై అభ్యర్థన.. కానీ..2022
ఈనెల 12న టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజున జాతీయ స్థాయిలో ఆర్ ఆర్ బీ ఎగ్జామ్ ఉండటంతో రెండు క్లాష్ అవుతుండటంతో టెట్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం..
ఇక.. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష కోసం 2683 సెంటర్లు ఏర్పాటు చేశారు. అబ్జర్వర్లుగా సీనియర్ అధికారులను నియమించారు. టెట్ పేపర్ 1 కు 1480 సెంటర్లలో 3,51,468 మంది అభ్యర్థులు, పేపర్ 2 కు 1203 కేంద్రాల్లో 2,77,000 మంది హాజరుకానున్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే కలెక్టర్లు టెట్ నిర్వహణపై సమీక్ష జరిపి ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లలోనికి అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు.