Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Rythu Runa Mafi 2023

రైతు రుణమాఫీపై .. గణాంకాలు లేకుండా తప్పుడు రాతలు

 

 

ఉన్నవీలేనివి రాస్తూ చిలువలు పలువలు చేసి రైతులను తప్పుదారి పట్టిస్తున్నది. పచ్చి అబద్ధాలు రాస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తే ప్రయత్నం చేస్తున్నది.

 

  • రైతు రుణమాఫీపై తప్పుడు రాతలు
  • గణాంకాలు లేకుండా పచ్చి అబద్ధాలతో కథనం ప్రచురణ
  • వడ్డీతోపాటు చెల్లిస్తున్న ప్రభుత్వం
  • రూ.లక్షలోపు రుణాలకూ భారం కాని వడ్డీ
  • 95 శాతానికిపైగా రెన్యువల్స్‌
  • ఇప్పటికే 25 వేల నుంచి 50 వేల దాకా మాఫీ 

 

 

 

పంట రుణమాఫీలోనూ ‘అంధజ్యోతి’ తన అక్కను వెళ్లగక్కింది. ఉన్నవీలేనివి రాస్తూ చిలువలు పలువలు చేసి రైతులను తప్పుదారి పట్టిస్తున్నది. పచ్చి అబద్ధాలు రాస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తే ప్రయత్నం చేస్తున్నది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్‌ ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష వరకు పంట రుణాన్ని మాఫీ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విడతల వారీగా రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రూ.25 వేలు, రూ.50 వేలు తీసుకున్న రైతుల రుణాలను ప్రభుత్వం వడ్డీతో సహా మాఫీ చేసింది.

 

 

 

రుణమాఫీలో వాస్తవాలు ఇవీ..

రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రైతులు పొందిన పంట రుణాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాఫీ చేసి వారికి అండగా నిలబడింది. 85,700 మందికిపైగా రైతులకు చెందిన దాదాపు రూ.333.15 కోట్ల రుణమాఫీ జరిగింది. రెండోసారి 2018లో మరోసారి రుణమాఫీ చేస్తున్నట్టు ప్రభు త్వం ప్రకటించింది. 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2018 డిసెంబర్‌ 11 వరకు పొందిన పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కారణంగా అమలులో కొంత ఆలస్యమైంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు అనేక సభల్లో చెప్పారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ రుణమాఫీ చేస్తారనే నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విడతల వారీగా రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ రూ.25 వేలు, రూ. 50 వేల రుణాలను మాఫీ చేశారు. కరీంనగర్‌ జిల్లాలో 25 వేలలోపు రు ణాలు తీసుకున్న 7,247 మందికి రూ.11.26 కో ట్లు, రూ.50 వేల వరకు తీసుకున్న 5,499 మందికి రూ.17. 72 కోట్లు మాఫీ అయింది. మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలోనూ సీఎం కేసీఆర్‌ ఇదే విషయాన్ని పేర్కొన్నారు.

 

 

అంతలోనే అంధజ్యోతి అక్కసు

సంపూర్ణ రుణమాఫీ ప్రక్రియ జరుగుతుండగానే ‘అంధజ్యోతి’ తన అక్కసు వెళ్లగక్కి రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నంలో బిజీగా ఉంది. బుధవారం ‘రుణమాఫీ పైసలు మిత్తికే చెలు’్ల శీర్షికతో అబద్ధాలు అచ్చేసింది.రూ. 25,50,75 వేలు తీసుకున్న రైతులకు అసలు మాత్రమే మాఫీ చేసి వడ్డీని రైతులకే వదిలేశారని రాసుకొచ్చింది. ప్రభుత్వం జాప్యం కారణంగా రూ.లక్ష పొందిన రైతులపై వడ్డీ భారం పడుతున్నదని పేర్కొన్నది. నిజానికి రూ.25 వేల నుంచి 50 వేల వరకు ఇప్పటికే మాఫీ జరిగింది. కటాఫ్‌ డేట్‌ 2018 డిసెంబర్‌ 11 వరకు బకా యి ఉన్న రైతులకు పంట రుణాలన్నింటినీ మాఫీ చేసిం ది. ప్రతి కుటుంబానికి రూ.లక్ష రుణమాఫీ ఇస్తామని చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటోంది. రూ.25 వేలు తీసుకున్న రైతులకు ఈ ఐదేండ్లలో ఎంత వడ్డీ ఉన్నా అసలు, వడ్డీ చెల్లిస్తున్నది. రూ.50 వేలు, రూ.75 వేలు తీసుకున్న రైతుల విషయంలోనే ప్రభుత్వం ఇదే విధంగా చర్యలు తీసుకుంటుంది.

 

 

రూ.లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఐదేండ్లలో రూ.60 వేలు వడ్డీ భారం పడుతుందని అంధజ్యోతి రాసుకొచ్చింది. కానీ కొన్ని విషయాల ను విస్మరించింది. రైతులు తమ పంట రుణాలను ఏడాదికోసారి రెన్యువల్‌ చేసుకుంటారు. తెలంగాణ ఏర్పడ్డాక రైతుబంధుతో పెట్టుబడి, సాగునీరు, 24 గంటల విద్యుత్తుతో పుష్కలమైన పంటలు పండుతున్నాయి. రుణమాఫీ జరుగుతుందని, రైతులు తమ రుణాలను తప్పక రెన్యువల్‌ చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ పలుమార్లు సూచించారు కూడా. ఈ మేరకు 95 శాతంపైగా రైతులు రుణాలను రెగ్యులర్‌గా రెన్యువల్‌ చేసుకుంటూనే ఉన్నారు. వీరిపై ఎలాంటి వడ్డీ పడడం లేదు. రైతుల రుణాలపై బ్యాం కులు 7 శాతం వడ్డీ విధిస్తాయి. ఇందులో 3 శాతం కేంద్రం, 4 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరి అలాంటప్పుడు రైతులపై వడ్డీభారం ఎక్కడ పడుతున్నదో అంధజ్యోతికే తెలియాలి. అతికొద్దిమందే రు ణాలను రెన్యువల్‌ చేయించుకోవడం లేదని బ్యాంక ర్లు చెబుతున్నారు. వీళ్లకూ లక్ష రుణమాఫీ వర్తిస్తుం ది. అప్పటివరకు ఉన్న వడ్డీని మాత్రమే వారు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంధజ్యోతి మాత్రం తన కథనంలో రుణమాఫీ పొందుతున్న ప్రతి రైతుపైన వడ్డీ భారం పడుతున్నట్టు అడ్డగోలుగా రాసేసింది.

 

 

ఇంటి పేరు… ఊరు పేరు లేదు!

  • అప్పు తీసుకున్న రైతుల్లో శ్రీనివాస్‌ పేరుతో 64 మంది

వరంగల్‌, ఆగస్టు 9(నమస్తేతెలంగాణ): తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాన్ని ‘అంధజ్యోతి’ కొనసాగిస్తున్నది. ఆకాశరామన్న తరహా కథనాలను ప్రచురిస్తున్నది. బుధవారం ‘రుణమాఫీ పైసలు మిత్తికే చెల్లు!’ శీర్షికన ప్రచురితమైన కథనమే ఇందుకు నిదర్శనం. వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన శ్రీనివాస్‌ అనే రైతు 2014 తర్వాత స్థానిక పీఏసీఎస్‌లో క్రాప్‌లోన్‌ తీసుకున్నాడని, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ కటా ఫ్‌ తేదీ 2018 డిసెంబరు 11 నాటికి శ్రీనివాస్‌ పేరిట రూ.లక్ష అప్పు ఉందని ఆ కథనంలో పేర్కొన్నది. ప్రభుత్వం సకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో శ్రీనివాస్‌ అప్పుల లెక్క తారుమారైందని, ఇప్పుడు ఆయన పేరు మీద రూ.1.60 లక్ష ల అప్పు ఉందని తెలిపింది. అయితే సదరు రైతు శ్రీనివాస్‌ ఇంటి పేరు, ఊరు పేరు ఎక్కడా పేర్కొనలేదు. దీంతో నర్సంపేట పీఏసీఎస్‌లో 2018 డిసెంబరు 11 నాటికి రూ.లక్ష అప్పు ఉన్న రైతు శ్రీనివాస్‌ ఎవరో తెలియక అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. నర్సంపేట పీఏసీఎస్‌ పరిధిలో ఉన్న 13 గ్రామాల నుంచి సుమారు 2,900 మం ది రైతులు నర్సంపేట పీఏసీఎస్‌లో రుణాలు తీసుకున్నారు. వీరిలో 2014 నుంచి 2018 వరకు రుణాలను పొందిన వారిలో శ్రీనివాస్‌ పేరు గల రైతులు 64 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ 64 మందిలో ఎవరూ రూ.85 వేలకు మించి నర్సంపేట పీఏసీఎస్‌లో రుణం తీసుకోలేదని నిర్ధారించుకున్నారు. ‘అంధజ్యోతి’ కథనంతో బుధవారం అధికారులు నర్సంపేట పీఏసీఎస్‌ రుణాల రికార్డులను పరిశీలించారు. ఈ రికార్డుల్లో శ్రీనివాస్‌ పేరుపై గరిష్ఠంగా రూ.85 వేల రుణం ఉన్నట్టు మాత్రమే గుర్తించారు.

 

 

 

అన్నదాతల ఆగ్రహం

రుణమాఫీపై అంధజ్యోతిలో వచ్చిన కథనంపై రైతులు మండిపడుతున్నారు. ఊహాజనిత కథనంతో తమను గంగరగోళానికి గురిచేసే ప్రయ త్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతు రూ.లక్ష పంట రుణం తీసుకుంటే ఏడాదిలోగా చెల్లించి కొత్తగా మరోసారి రుణం తీసుకుం టే 7% వడ్డీ మాత్రమే పడుతుంది. కటాఫ్‌ తేదీలోగా చెల్లిస్తే వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటాల రూపం లో దానిని చెల్లిస్తున్నాయి. చాలామంది ప్రతి సీజన్‌లోనూ రుణం తీసుకుంటారు. 6 నెలలకోసారి రుణాలు రెన్యువల్‌ అవుతుంటాయి. ఏ కొందరు మాత్రమే ఏడాదిలోపు చెల్లించకుంటే 11.5% మాత్రమే వడ్డీ పడుతున్నది. కానీ అంధజ్యోతి మాత్రం 12% వడ్డీ అంటూ రాసుకొచ్చింది. రూ.లక్ష రుణం తీసుకున్న రైతుపై ఏటా రూ.12 వేలు, ఐదేళ్లలో రూ.60 వేల వడ్డీ పడిందని రాసింది. కథనంలో ఎక్కడా గణాంకాల ప్రస్తావన లేకుం డా వడ్డీ భారమంటూ రాసి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం చేసిన పత్రికపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 

 

Related Articles

Back to top button