TS TET 2022 details || TET application district wise exam center full complete details 2022
TS TET 2022: టెట్ పరీక్షకు ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారో తెలుసా.. పేపర్ వారీగా వివరాలు

TS TET 2022 | టెట్ పరీక్ష కోసం మార్చి 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. ఏప్రిల్ 12తో గడువు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు మాత్రం ఏప్రిల్ 11వ తేదీ (సోమవారం) ఆఖరిరోజు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు భారీగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు.
టెట్ (TET) పరీక్ష కోసం మార్చి 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. ఏప్రిల్ 12తో గడువు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు మాత్రం ఏప్రిల్ 11వ తేదీ (సోమవారం) ఆఖరిరోజు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు భారీగానే అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. సోమవారం వరకు మొత్తం 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్ట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు పేపర్ -1కు 3,38128 మంది దరఖాస్తు చేసుకొన్నారు. పేపర్ -2కు 2,65,907 మంది దరఖాస్తు చేసుకొన్నారు. మొత్తం 6,04,035 మంది దరఖాస్తు చేసుకొన్నట్టు అధికారిక సమాచారం.
అంతే కాకుండా భారీ అప్లికేషన్ల కారణంగా 27 జిల్లాల్లో టెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి తలెత్తింది. దీంతో ఆయా జిల్లాలను అధికారులు బ్లాక్ చేశారు. సోమవారం వరకు కేవలం జగిత్యాల, కరీంనగర్, జనగామ, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలు కేటాయించే అవకాశముండటంతో, వాటినే పరీక్షా కేంద్రాల జాబితాలో ఉంచారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయో.. అటు చాలా కాలం నుంచి టెట్ లేకపోవడంతో అభ్యర్థులు ఈ సారి భారీ సంఖ్యలో ఉన్నారు.
టెట్ లో పేపర్ -1, పేపర్-2కు ఉంటాయి. ప్రతీ పేపర్ కు కూడా 150 మార్కులు ఉంటాయి.
– అభ్యర్థులు వారి విద్యార్హత, ఆసక్తి, ఎంచుకున్న పోస్టు ఆధారంగా పేపర్-1 లేదా పేపర్ 2 ను ఎంచుకుంటారు.
– జనరల్ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధిస్తే టెట్ లో క్వాలిఫై అవుతారు.
– బీసీ అభ్యర్థులు అయితే 50 శాతానికి పైగా మార్కులు సాధిస్తే సరిపోతుంది.
– ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు అయితే 40 శాతానికి పైగా మార్కులు సాధిస్తే సరిపోతుంది.
– టెట్ లో మంచి మార్కులు సాధిస్తే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ లోనూ ప్రయోజనం ఉంటుంది. టెట్ స్కోర్ కు TRT(టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్)లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
TS Jobs Coaching: నిరుద్యోగులకు అలర్ట్.. ఉచిత శిక్షణ.. రూ.1,500 విలువైన స్టడీ మెటీరియల్
– టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే జాబ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించుకోవాల్సి ఉంటుంది.
ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు చేసింది తెలంగాణ సర్కార్. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసే అవకాశం ఉండేది. అయితే ఈ సారి ఆ రూల్స్ మారాయి. ఈ సారి బీఈడీ అభ్యర్థులు కూడా టెట్ పేపర్ 1 రాసే అవకాశాన్ని కల్పించింది తెలంగాణ సర్కార్. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఆదేశాల మేరకు ఈ మార్పులు చేసింది ప్రభుత్వం.

ప్రతీకాత్మక చిత్రం