Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Propaganda of not giving Rythu Bandhu.. This is Bhatti’s counter..! || రైతుబంధు ఇవ్వలేదని ప్రచారం.. భట్టి కౌంటర్ ఇదే..!

రైతుబంధు ఇవ్వలేదని ప్రచారం.. భట్టి కౌంటర్ ఇదే..!

 

 

రైతుబంధు ఇవ్వలేదని ప్రచారం.. భట్టి కౌంటర్ ఇదే..!

 

 

 

రైతుబంధుపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు.

రైతుబంధుపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకానికి జీరో బిల్లు అమలు చేశామన్నారు.

గత ప్రభుత్వం వదిలేసిన డ్వాక్రా సంఘాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టిందన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాలు చేపడతామన్నారు. వంద రోజుల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేపట్టామన్నారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు.

దేశం ఆశ్చర్య పోయేలా సభను విజయవంతం చేయాలన్నారు. తుక్కుగూడ సభకు శ్రేణులు కదిలిరావడంపై సన్నద్ధం కావాలన్నారు. ప్రజల్లో ఉన్న స్పందనను ప్రచారంలో వాడుకోవాలన్నారు. రైతుబంధు ఇవ్వలేదని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. 64.75లక్షల మందికి రూ.5,500 కోట్లు రైతు బంధు నిధులు జమ చేశామన్నారు. ఐదెకరాల వరకు ఇప్పటివరకు రైతుబంధు నిధులు జమ చేశామన్నారు.

మిగతా 5 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధుల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ వచ్చాక ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామన్నారు. మూసీ అభివృద్ధి, ట్రిపుల్‌ఆర్‌పై కేంద్రం నుంచి నిధులు తెచ్చే పనులు చేపట్టామన్నారు.

 

Related Articles

Back to top button