షావోమీ తీసుకొస్తుంది 100 ఎంపీ మెగా పిక్సల్ కెమెరా తో కొత్త ఫోన్
షావోమీ తీసుకొస్తుంది 100 ఎంపీ మెగా పిక్సల్ కెమెరా తో కొత్త ఫోన్
ఇప్పటి వరకు స్మార్ట్ఫోన్లలో 48 మెగాపిక్సెల్ కెమెరాను మాత్రమే చూశాం. త్వరలో 64 ఎంపీ కెమెరాతో శాంసంగ్, షావొమీతోపాటు రియల్మీ స్మార్ట్ఫోన్లు విడుదల చేయనున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే కనీవినీ ఎరుగని రీతిలో 100 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌కు శ్రీకారం చుట్టినట్టు షావొమీ ప్రకటించింది.
శాంసంగ్ సెన్సార్‌తో ఇది రూపుదిద్దుకోనుందని సమాచారం. 108,000,000 పిక్సెల్స్, 12032గీ9024 రిజొల్యూషన్ ఉండనుంది. అల్ట్రా క్లియర్ కెమెరా ఆవిష్కరించనున్నట్టు షావొమీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ వెల్లడించారు. ప్రపంచంలో ఈ స్థాయి కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ ఇదే కానుంది. 100 ఎంపీ కెమెరా మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చిలో లెనొవో ప్రకటించడం గమనార్హం. కాగా, 100కు బదులుగా 108 ఎంపీతో షావొమీ ఫోన్ వచ్చే అవకాశం ఉంది.