Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TS Govt Jobs 2022 || తెలంగాణలో మరో 10,105 ఉద్యోగాలు.. అనుమతిచ్చిన ప్రభుత్వం.. విభాగాల వారీగా ఖాళీల వివరాలివే

తాజా ఉద్యోగాల అనుమతితో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లయ్యింది. ఇవి కాకుండా త్వరలో మరిన్ని జాబ్‌ నోటిఫికేషన్లు రానున్నట్లు మంత్రి హరీశ్‌రావ్‌ వెల్లడించారు.

 

 

 

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో మ‌రో 10,105 ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తి ఇచ్చింది. ఇందులో గురుకులాల్లోనే 9,096 పోస్టులున్నాయి. బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులు ఉన్నాయి. ఈపోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.

 

ఇక.. ఎస్సీ అభివృద్ధిశాఖలో 316, మహిళా శిశు సంక్షేమశాఖలో 251, బీసీ సంక్షేమశాఖలో 157, గిరిజన సంక్షేమశాఖలో 78, దివ్యాంగశాఖలో 71, జువైనల్‌ వెల్ఫేర్‌లో 66 పోస్టులు సహా ఇతర 995 ఉద్యోగాలను TSPSC ద్వారా భర్తీ చేయనున్నారు. మహిళా శిశుసంక్షేమశాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

 

తాజా అనుమతితో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లయ్యింది. ఇవి కాకుండా త్వరలో మరిన్ని జాబ్‌ నోటిఫికేషన్లు రానున్నట్లు మంత్రి హరీశ్‌రావ్‌ వెల్లడించారు.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button