Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS Rythu Bandhu Updates

రైతుబంధుకు మొండిచేయేనా..!

 

 

 

రైతుబంధుకు మొండిచేయేనా..!

 

రైతుబంధు రాకపోవడంపై జిల్లా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఐదెకరాల లోపు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయమందిందని కాంగ్రెస్‌ చెబుతున్నా, అసలు నాలుగెకరాలున్నవారికే ఇప్పటి దాకా దిక్కు లేదని రైతులు మండిపడుతున్నారు.

 

  • పంటలు చేతికొస్తున్నా అందని పెట్టుబడి సాయం
  • ఇప్పటి వరకు మూడెకరాలకు మించి ఇవ్వని సర్కారు
  • శాటిలైట్‌ సర్వే పేరిట కొత్త నిబంధనలు తెచ్చే యోచన
  • ఐదెకరాల పైనున్న వారు ఆశలు వదులుకోవాల్సిందేనా..!

 

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ఏప్రిల్‌ రైతుబంధు రాకపోవడంపై జిల్లా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఐదెకరాల లోపు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయమందిందని కాంగ్రెస్‌ చెబుతున్నా, అసలు నాలుగెకరాలున్నవారికే ఇప్పటి దాకా దిక్కు లేదని రైతులు మండిపడుతున్నారు. ఈ పథకం అమలుపై కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు తెలుస్తుండగా, ఇక రైతుబంధుకు రాం.. రాం.. తప్పదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాటిలైట్‌ ద్వారా సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయనేది స్పష్టంగా తెలుసుకొని.. ఆపై రైతుబంధు ఇవ్వాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, ఈ పథకంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రైతాంగం ఆశలు వదులుకొనే పరిస్థితి దాపురిస్తున్నది.

 

యాసంగి పంటలు చేతికొస్తున్నా..

ఐదెకరాల్లోపు రైతుబంధు అందించామని చెబుతున్న కాంగ్రెస్‌ సర్కారు.. ఆ పైన భూములున్న వారికి మాత్రం మొండిచేయి చూపుతున్నది.పంటలు వేసే సమయంలో పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా, ప్రస్తుతం పంటలు చేతికి వస్తున్నా.. పైసా దిక్కు లేదని రైతులు మండిపడుతున్నారు. గతేడాది యాసంగిలో కేసీఆర్‌ సర్కారు జిల్లాలోని 1,31,518 మంది రైతులకు దాదాపు రూ. 128 కోట్లు ప్రభుత్వం అందించింది. కానీ, ఈ యాసంగిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికీ రైతుబంధు అందించలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త నిబంధనల పేరిట సర్వేలు చేయిస్తే అనేక సమస్యలు తెరపైకి వస్తాయని, రైతుబంధు పథకంపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

రైతుబంధు డబ్బులు రాలే

నాకు నాలుగెకరాల భూ మి ఉంది. గతేడాది కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పు డు ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ. 20 వేలు నా బ్యాంకు ఖాతాలో పడ్డయి. కానీ ఈ యా సంగిలో కాంగ్రెస్‌ సర్కా రు ఇప్పటికీ పెట్టుబడి సా యం అందించలేదు. అప్పు లు చేసి పంటలేసిన. రైతుబంధు వస్తదనే నమ్మకం లేకుంటైంది. మున్ముందు ఎలాంటి సాకులు చెప్పి రైతుబంధు ఆపేస్తరోనని అనుమానంగా ఉంది.

 

 

రైతుబంధు ఉంటదో… పోతదో..

రైతుబంధు అమలుపై మా కు నమ్మకం పోతుంది. కాం గ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తప్పుచేశామనిపిస్తోంది. రైతుబంధు అమలుపై ఇన్ని రకా ల ఇబ్బందులు పెడుతదనుకోలే. కేసీఆర్‌ సర్కారులో సమయానికి డబ్బులు అందినయి. ఇప్పుడు కొత్త సర్వేలు చేపట్టి రైతుబంధు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే అసలు రైతుబంధు పథకం ఉంటదో.. పోతదో అన్న అనుమానం కలుగుతుంది.

 

సాయం అందించిన తర్వాతే సర్వే చేయాలి

కెరమెరి, ఏప్రిల్‌ 21 : శాటిలైట్‌ సర్వే కు సమయం పడుతోంది. అప్పటి వరకు సాగు చేస్తున్న భూములకు పెట్టుబడి సాయం అందించాలి. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. జూన్‌ 4న ఫలితాలు వస్తాయి. అప్పటి వరకు వానకాలం సీజన్‌ వస్తుంది. ఇగ ఆ సమయంలో సర్వేలు చేపడితే రైతుబంధు ఎప్పుడిస్తరు. అవసరమనుకుంటే పెట్టుబడి సాయం అందించిన తర్వాతే సర్వేలు నిర్వహించాలి. అంతేగాని సర్వేల పేరిట కాలయాపన చేసి రైతులకు నష్టం చేయవద్దు.

 

 

 

 

Related Articles

Back to top button