Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

APPSC JOBS 2023

APPSC || ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నోటిఫికేషన్..3,220 పోస్టులకు రిక్రూట్‌మెంట్

 

 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

APPSC: యూనివర్సీటిల్లో టీచింగ్ ప్రొఫెషన్‌కు మంచి గుర్తింపు ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. జీతాలు కూడా భారీగా ఉండటంతో హై-ఎండ్ లైఫ్‌ను లీడ్ చేయవచ్చు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న టీచింగ్ వృత్తిని ఎంచుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ గడువు నవంబర్ 20తో ముగుస్తుంది.

 

 

యూనివర్సీటిల్లో టీచింగ్ ప్రొఫెషన్‌కు మంచి గుర్తింపు ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. జీతాలు కూడా భారీగా ఉండటంతో హై-ఎండ్ లైఫ్‌ను లీడ్ చేయవచ్చు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న టీచింగ్ వృత్తిని ఎంచుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ గడువు నవంబర్ 20తో ముగుస్తుంది.

 

 

ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వంటి పోస్టుల్లో మొత్తం 3,220 ఖాళీలను భర్తీ చేస్తుంది.

అర్హత ప్రమాణాలు

ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఇండియన్ యూనివర్సిటీ లేదా విదేశీ ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) లేదా ఏపీ SLET/AP SET పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీహెచ్‌డీ డిగ్రీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

అసోసియేట్ ప్రొఫెసర్ అభ్యర్థులు పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత ఫీల్డ్‌లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అకడమిక్ లేదా రీసెర్చ్ విభాగాల్లో టీచింగ్ లేదా రీసెర్చర్‌గా కనీసం ఎనిమిదేళ్ల ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.

 

 

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అప్లై చేసేవారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి. టీచింగ్, రీసెర్చ్‌లో‌ కనీసం పదేళ్ల ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయికి సమానమైన స్థాయిలో కనీసం మూడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉండాలి. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో కనీసం 6 రీసెర్చ్ పబ్లికేషన్స్ ట్రాక్ రికార్డ్‌ ఉండాలి.

 

 

రిజిస్ట్రేషన్ ప్రాసెస్

– ముందు అధికారిక పోర్టల్‌ psc.ap.gov.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనే ఆప్షన్ సెలక్ట్ చేయాలి.

– ఆ తరువాత ‘రిక్రూట్‌మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్-2023’ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ పరిశీలించాలి.

– అనంతరం ‘అప్లై నౌ’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

– రిజిస్ట్రేషన్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. అన్ని వివరాలతో అప్లికేషన్ నింపాలి.

 అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫారమ్ సబ్‌మిట్ చేయాలి.

ఎంపిక ప్రక్రియ

ఏపీపీఎస్సీ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముందు స్క్రీనింగ్ టెస్ట్, ఆ తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను ఏపీపీఎస్సీ త్వరలో వెల్లడిస్తుంది.

 

 

జీతభత్యాలు

అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్ట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ. 57,700 నుంచి రూ.1,82,400 మధ్య ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1,31,400 నుంచి రూ.2,17,100, ప్రొఫెసర్లకు రూ. 1,44,200 నుంచి రూ. 2,18,200 వరకు జీతం లభిస్తుంది.

 

 

 

 

Related Articles

Back to top button