Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Crop Loan Waiver | రుణమాఫీకి 18 వేల కోట్లు విడుదల..

సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చిన 24 గంటల్లోపే బడ్జెట్‌ రిలీజ్‌

 

 

Crop Loan Waiver | సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చిన 24 గంటల్లోపే బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ జారీ చేసిన ఆర్థికశాఖ రాష్ట్రంలో లక్ష లోపు రుణాల మాఫీకి తొలగిన అడ్డంకులు తొలిరోజు 41 వేల లోపు పంట రుణాలు మాఫీ.. 62,758 మంది రైతులకు రుణవిముక్తి నిధులెట్ల అన్నోళ్లకు ‘చుక్తా’తో చెంపపెట్టు సమాధానం రైతుల కోసం కష్టమైనా సరే అవసరమైన నిధులను సమీకరించిన రాష్ట్ర ప్రభుత్వం

 

 

‘రూ.19 వేల కోట్లతో మొత్తం రుణమాఫీ చేస్తరట! ఇది జరిగే పనేనా? అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తరు? రుణమాఫీ ఎట్ల చేస్తరు? ఇది జరిగేది లేదు.. పోయేది లేదు’- రైతులకు పంటల రుణాల మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించగానే నిట్టూర్పు శక్తులు చేసిన వ్యాఖ్యలివి. రుణమాఫీకి నిధులెట్ల అన్నోళ్ల నోర్లు మూయించేలా సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కనీవినీ ఎరగని రీతిలో రుణమాఫీకి అవసరమైన మొత్తం నిధులను ఒకేసారి విడుదల చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్థికశాఖ రుణమాఫీకి అవసరమైన మొత్తం రూ.18,241.94 కోట్ల నిధులను విడుదల చేస్తూ గురువారం బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బీఆర్వో) జారీ చేసింది. దీంతో 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.37 వేల నుంచి రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు అవసరమైన నిధుల సమస్య తీరిపోయింది. వాస్తవానికి పంట రుణాల మాఫీపై ప్రభుత్వం ఈ ఏడాది తొలి నుంచే దృష్టి సారించింది.

 

 

ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6,385.20 కోట్లు కేటాయించగా, తాజాగా మరో రూ.12,548.60 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా రుణమాఫీకి అవసరమైన రూ.18,241.94 కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేసింది. దీంతో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ సాఫీగా జరగనున్నది. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు సెప్టెంబర్‌ రెండో వారం కన్నా ముందే రుణమాఫీ పూర్తయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుణమాఫీకి సంబంధించి రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి రైతుకు గడువులోగా రుణమాఫీ జరిగి తీరుతుందని అధికారులు చెప్తున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణమాఫీ కోసం నిధుల సమీకరణ కత్తి మీద సామే అన్న అభిప్రాయాలుండేవి. కానీ సీఎం కేసీఆర్‌కు రైతుల సంక్షేమం ముందు ఆ కష్టాలేవీ పెద్దగా అనిపించలేదు. అందుకే రుణమాఫీ చేయడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో అవసరమైన నిధులను సమీకరించారు. రైతు సంక్షేమంపై చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు.

 

 

తొలిరోజు 41 వేల లోపు రుణాలు మాఫీ

రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియలో తొలిరోజైన గురువారం రూ.37 వేల నుంచి రూ.41 వేల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇందుకోసం రూ.237.85 కోట్లను బ్యాంకులకు చెల్లించింది. దీంతో 62,758 మంది రైతులు రుణవిముక్తులయ్యారు. గురువారం నుంచే రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చిన 24 గంటల్లోనే వాస్తవరూపం దాల్చడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఊరూరా సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. ప్రతిరోజూ ఇదేవిధంగా కొందరికి చొప్పున సెప్టెంబర్‌ రెండో వారం వరకు రూ.లక్ష లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది. గతంలో రూ.36 వేలలోపు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే.

 

 

బీఆర్‌ఎస్‌ అంటే రైతు సంక్షేమ పార్టీ

బీఆర్‌ఎస్‌ అంటే రైతు సంక్షేమ పార్టీ అని మరోసారి నిరూపితమైంది. అన్నదాతలను రుణవిముక్తం చేయడంతోపాటు ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. మొత్తం రుణమాఫీకి అవసరమైన రూ.18,241 కోట్లకు ఆర్థికశాఖ బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ విడుదల చేసింది. ఇందులోభాగంగా రూ.37 వేల నుంచి రూ. 41 వేల మధ్య గల రుణాలను మాఫీ చేసేందుకు రూ.237.85 కోట్లను విడుదల చేసింది. తద్వారా 62,758 మంది రైతులకు లబ్ధి చేకూరింది.

 

 

 

Related Articles

Back to top button