Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

EMRS Recruitment 2023

Tearchrs Recruitment 2023

 

 

EMRS Recruitment 2023: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు రెండు నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. వీటిలో కొన్ని పోస్టులకు బీఈడీ అర్హత అవసరం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

 

 

దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాల(EMRS)ల్లో సిబ్బంది నియామకానికి భారీ నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే. రెండు వేర్వేరు నోటిఫికేషన్లతో మొత్తం 10,391 మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని భర్తీ చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

 

జూన్‌ నెలాఖరున 4,062 పోస్టులకు మొదటి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. దరఖాస్తుల సమర్పణకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొత్తగా మరో 6 వేలకు పైగా పోస్టుల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్‌ వెలువడింది.

 

 

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ (TGT) సహా మొత్తం 6,329 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(NESTS) నోటిఫికేషన్‌ ఇచ్చింది.

ఆకర్షణీయ వేతనాలతో ప్రిన్సిపల్‌, పీజీటీ, అకౌంటెంట్‌తో పాటు మొత్తం 4,062 పోస్టులకు గత నెలలో విడుదలైన నోటిఫికేషన్‌కు దరఖాస్తుల గడువు జులై 31తో ముగియనుండగా.. టీజీటీ, లైబ్రేరియన్‌, హాస్టల్‌ వార్డెన్‌ సహా మొత్తం 6,329 పోస్టులకు దరఖాస్తుల గడువు ఆగస్టు 18 వరకు ఉంది. అర్హులైన అభ్యర్థులు https://emrs.tribal.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఉద్యోగ ఖాళీలు.. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (TGT)  ఖాళీలు 5660.  సబ్జెక్టుల వారీగా చూస్తే హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్‌, సోషల్‌ స్టడీస్‌, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్‌, ఆర్ట్‌, పీటీటీ (మేల్‌), పీఈటీ (ఫిమేల్‌), లైబ్రేరియన్ చొప్పున ఉద్యోగాలు ఉన్నాయి.

 

వీటితో పాటు బీఈడీతో సంబంధం లేకుండా..   మ్యూజిక్‌, ఆర్ట్‌, పీఈటీ (పురుషులు), పీఈటీ (మహిళలు), లైబ్రేరియన్‌ విభాగంలోనూ ఖాళీలను భర్తీ చేయనున్నారు.  వీటితో పాటు  హాస్టల్‌ వార్డెన్‌ పురుషుల విభాగంలో 335 ఖాళీలు, మహిళల విభాగంలో 334 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు.

 

టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్‌ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. హాస్టల్‌ వార్డెన్ పోస్టులకు ఏదైనా డిగ్రీ  ఉంటే చాలు. టీజీటీ పోస్టులకు రూ.1500; హాస్టల్ వార్డెన్ రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులైతే ఎలాంటి ఫీజు చెల్లించనవసరంలేదు.

 

 

ఓఎంఆర్‌ ఆధారిత(పెన్‌ పేపర్‌) విధానంలో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు. టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు), లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్టుకు 30 మార్కులు(30 ప్రశ్నలు) కేటాయించారు. హాస్టల్ వార్డెన్‌ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు) కేటాయించారు. టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్ వార్డెన్‌ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

 

 

ఇక మొదట విడుదల చేసిన నోటిఫికేషన్లో.. అకౌంటెంట్‌ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉంటే చాలు. వయసు 30 ఏళ్లు మించొద్దు. నెలకు రూ.35400-రూ.112400 చెల్లిస్తారు. జేఎస్‌ఏ ఉద్యోగాలకు సీనియర్‌ సెకండరీ ఉత్తీర్ణులైతే చాలు. వయసు 30 ఏళ్లు మించరాదు. రూ.19900-రూ.63200 చెల్లిస్తారు. ల్యాబ్‌ అటెండెంట్‌ ఉద్యోగాలకు 10/12వ తరగతి పాసైతే చాలు. వేతనం రూ.18000-రూ.56,900గా పేర్కొన్నారు.

 

 

 

 

 

 

Related Articles

Back to top button