Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Farmers Alert PM Kisan Alert.. Money is going into the account..! The center is a key reference

Farmers Alert పీఎం కిసాన్ అలర్ట్.. డబ్బు ఖాతాలో పడబోతోంది..! కేంద్రం కీలక సూచన

 

 

PM Kisan Yojana: రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పీఎం కిసాన్ యోజన. ఈ పథకం అమలులో కేంద్రం పలు కీలక సూచనలు చేస్తోంది.

 

 

.రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పీఎం కిసాన్ యోజన. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఈ పథకం కింద రైతులకు ఏటా మూడు విడతలుగా 6000 రూపాయల పంట సాయం అందిస్తున్నారు.

 

 

.ఏప్రిల్- జులై, ఆగస్టు- నవంబర్, డిసెంబర్-మార్చి సమయంలో కేంద్రం ఈ ఆర్థిక సాయం నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతుంది. రీసెంట్ గానే పీఎం కిసాన్ 15వ విడత నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది.

 

 

.నవంబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ ఝార్ఖండ్ పర్యటనలో సమయంలో పీఎం కిసాన్ 15వ విడత అమౌంట్ పంపిణీ చేశారు. మొత్తం 8 కోట్ల మందికి పైగా లబ్ధిదారుల అకౌంట్లలో 2 వేల రూపాయల చొప్పున డబ్బు జమ అయింది.

 

 

ఇక ఇప్పుడు రైతులంతా పీఎం కిసాన్ 16వ విడత డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ 16వ విడత డబ్బు పంపిణీపై పలు కీలక సమాచారాలు చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలో రైతుల ఖాతాలకు ఈ డబ్బు పంపవచ్చని తెలుస్తోంది.

 

అయితే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం పొందాలంటే కొన్ని పనులు తప్పక చేయాల్సి ఉంటుంది. ప్రతి రైతుకు ఈ- కేవైసీ అనేది మస్ట్. ఈ- కేవైసీ పూర్తి చేసిన రైతులకే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనం అందుతోంది.

 

 

కాబట్టి ఫిబ్రవరి లోగా ప్రతి రైతు కూడా ఈ- కేవైసీ పూర్తి చేయాలి. ఆన్ లైన్ విధానంలో మీ ఈ- కెవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అకౌంట్‌కు ఆధార్ నంబర్ లింక్ చేయడం కూడా ముఖ్యం అని కేంద్రం చెబుతోంది. ఇలా చేసిన వారికి మాత్రమే డబ్బులు ఖాతాలో పడతాయట.

 

16వ విడత నుంచే బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విధానం వల్ల డబ్బులు పడే అకౌంట్ ఎవరిదీ అనే విషయం ప్రభుత్వానికి క్లారిటీగా తెలుస్తుంది.

 

ఈ- కెవైసీ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌ pmkisan.gov.in లోకి వెళ్లి.. ఫార్మర్స్ కార్నర్‌లో ఉన్న న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌, భూమికి సంబంధించిన వివరాలతో పూర్తి సమాచారం ఎంటర్ చేయాలి.

 

PM KISHAN FULL INFORMATION

 

 

 

Related Articles

Back to top button