Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

FCI Recruitment 2022

నిరుద్యోగులకు అదిరే శుభవార్త.. FCIలో 5043 ఉద్యోగాలను నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

 

 

 

 

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5043 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్‌ను నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ మరియు నార్త్-ఈస్ట్ జోన్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం కోసం నిర్వహిస్తున్నారు. అర్హత, ఆషక్తి కలిగిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

 

 

 

\1\6జోన్ల వారీగా ఖాళీల వివరాలు:

 

 

జోన్ఖాళీలు
నార్త్ జోన్2388 ఖాళీలు
సౌత్ జోన్989 ఖాళీలు
ఈస్ట్ జోన్768 ఖాళీలు
వెస్ట్ జోన్713 ఖాళీలు
నార్త్ ఈస్ట్ జోన్185 ఖాళీలు
మొత్తం: 5043

 

 

నోటిఫికేషన్ ప్రకారం.. మెకానికల్‌లో సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ మరియు జూనియర్ ఇంజనీర్, స్టెనో గ్రేడ్-3 మరియు AG-3 జనరల్, అకౌంట్స్, టెక్నికల్, డిపో, హిందీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

 

 

JE (EME) – 1 సంవత్సరం అనుభవంతో EE/ME ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా.
JE (సివిల్) – 1 సంవత్సరం అనుభవంతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా.
AG-III (టెక్నికల్) – అగ్రికల్చర్ / బోటనీ / బయాలజీ / బయోటెక్ / ఫుడ్‌లో గ్రాడ్యుయేషన్.
AC-III (జనరల్) – గ్రాడ్యుయేషన్ డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్.
AG-III (అకౌంట్స్) – B.Com మరియు కంప్యూటర్ నాలెడ్జ్.

 

 

AG-III (డిపో) – గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ నాలెడ్జ్.
హిందీ టైపిస్ట్ AG-II (హిందీ) – హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 వర్డ్స్ స్పీడ్, గ్రాడ్యుయేషన్. అనువాదంలో 1 సంవత్సరం అనుభవం.
స్టెనో గ్రేడ్-II – DOEC O స్థాయి సర్టిఫికేట్‌తో గ్రాడ్యుయేట్. టైపింగ్ మరియు స్టెనో పరిజ్ఞానం.

 

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రెండు ఫేజ్ లలో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. స్టెనో పోస్టులకు సంబంధించి స్కిల్/టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
-తెలుగు రాష్ట్రాల్లో ఫేజ్-1 ఎగ్జామ్ సెంటర్లు: నెల్లూరు , విజయవాడ , కాకినాడ, కర్నూలు , తిరుపతి , విజయనగరం, రాజమండ్రి , ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button