Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

‘Grihalakshmi’ will be applied to women. CM KCR’s ambitious ‘Grihalakshmi’ scheme… will realize the dream of the poor.

 

 

గృహలక్ష్మి ప్రాప్తిరస్తు

 

మహిళలకు ‘గృహలక్ష్మి’ వర్తించనున్నది. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గృహలక్ష్మి’ పథకం.. పేదల సొంతింటి కలను సాకారం చేయనున్నది.

 

 

  • నిరుపేదలకు వరంలా ‘గృహలక్ష్మి’ పథకం
  • ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఆర్థిక సాయం
  • మూడు విడుతల్లో పంపిణీ
  • నియోజకవర్గంలో 3 వేల మందికి అవకాశం
  • రేపటివరకు దరఖాస్తుల స్వీకరణ
  • 25న లబ్ధిదారుల ఎంపిక
  • సందడిగా మారిన తాసీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాలు

 

 

మహిళలకు ‘గృహలక్ష్మి’ వర్తించనున్నది. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గృహలక్ష్మి’ పథకం.. పేదల సొంతింటి కలను సాకారం చేయనున్నది. నియో జకవర్గానికి మూడు వేల ఇండ్ల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పథకంలో భాగంగా సొంత జాగాల్లో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నది. లబ్ధిదారుల ఖాతాల్లో మూడు విడుతల్లో డబ్బులను జమ చేయనుండగా.. నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి.. 25న లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు తక్కువ వ్యవధి ఉండడంతో మీ సేవ కేంద్రాలు, తాసీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాలు సందడిగా మారాయి.

 

 

పేద మహిళలు గృహలక్ష్మిలుగా మారబోతున్నా రు. సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం పే దల సొంతిటి కలను సాకారం చేయనుంది. ప్రతి ని యోజకవర్గంలో 3వేల మందికి అవకాశం కల్పించనున్నారు. గురువారంతో దరఖాస్తుల స్వీకరణ పూర్తి చే సి 25వ తేదీన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దీంతో మీసేవ కేంద్రాలు, తాసీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాలు సందడిగా మారాయి.

 

 

పేదలకు వరం ‘గృహలక్ష్మి’

 

పేదల సొంతింటి కలను గృహలక్ష్మి పథకం తీర్చనున్న ది. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ఆసరా పిం ఛన్లు, రైతుబంధు, రైతులు, బీడీ, చేనేత, కల్లుగీత కా ర్మికులకు బీమా పథకం, ఎస్సీలు, నాయీబ్రాహ్మణు లు, రజకులకు విద్యుత్‌పై సబ్సిడీ, రూ.లక్షతో బీసీ, మైనార్టీ బంధు, రూ.10లక్షల దళితబంధు, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషియన్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, మిషన్‌ కాకతీయ, కంటి వెలుగు, ఆ హార భద్రత, గొర్రెలు, చేపల పంపిణీ వంటి పథకాలు పేదల్లో ఆర్థిక భరోసాను తీసుకొచ్చాయి. ఈక్రమంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేలా రూ.3లక్షల తో గృహలక్ష్మి పథకాన్ని తీసుకురావడం గమనార్హం. ఈ పథకంలో భాగంగా పేదలు తమకున్న సొంత ఖా ళీ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ. 3లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. ఎంపికైన లబ్ధిదారుడు మూడు విడుతల్లో నిధులను పొందవచ్చు. బేస్‌మెంట్‌ లెవల్‌లో రూ.లక్ష, రూఫ్‌ లెవల్‌లో మరో రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష చొప్పున మంజూరవుతాయి.

 

 

మహిళల పేరిటే ఈ పథకంలో నిధులు మంజూరు కానున్నాయి. లబ్ధిదారుడు ఇంటిని తనకు నచ్చినట్లుగా నిర్మించుకోవచ్చు. గతం లో మాదిరిగా ఆర్సీసీతోనే కట్టుకోవాలి, నిర్ణీత విస్తీర్ణంలోనే నిర్మించుకోవాలి అనే నిబంధనలేవీ ప్రభుత్వం విధించడం లేదు. ఫలితంగా పేదలు తమకు ఉన్న స్థలంలో ఇష్టమైన రీతిలో ఇంటిని కట్టుకోవచ్చు. దీనికోసం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈనెల 10వ తేదీ వరకు అర్హులు మున్సిపల్‌ కార్యాలయాలు, తాసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తులను అందించాలి. స్థానికులై, ఆహార భద్రతకార్డు కలిగిన వారు, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేర గృహలక్ష్మి పథకానికి అర్హులవుతారు. వచ్చిన దరఖాస్తులను అధికారులు ఈనెల 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి 25వ తేదీన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికలో పాదర్శకతను పాటించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. దరఖాస్తుకు తక్కువ వ్యవధి ఉండటంతో ఆయా కార్యాలయాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇలా పేదలు గత కొన్నేండ్లుగా సొంతింటి జాగాల్లో స్థలాల నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న కలను సీఎం కేసీఆర్‌ నెరవేర్చనుండడం విశేషం.

 

 

పారదర్శకంగా ఎంపిక
గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతాం. రేపటి వరకు దరఖాస్తులు స్వీకరించి, ప్రత్యేక బృందాలతో పురపాలికలు, గ్రామాల్లో 24వరకు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తారు. ఈనెల 25న లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. పేదలు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. మధ్యవర్తులను నమ్మవద్దు. అర్హులను పారదర్శకంగా ఎంపిక చేస్తాం.

 

 

అర్హతలు, మార్గదర్శకాలు

  • మహిళల పేరిటే గృహలక్ష్మి పథకం మంజూరవుతుంది.
  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా మహిళ లేదా వితంతువు అయి ఉండాలి.
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా స్థానికులై ఉండాలి.
  • ఆధార్‌ లేదా ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉండాలి.
  • ఇంటి నిర్మాణానికి ఖాళీ స్థలం ఉండాలి.
  • లబ్ధిదారుడు లేదా ఆ కుటుంబసభ్యుల పేరిట ఆహార భద్రత కార్డు ఉండాలి.
  • దరఖాస్తుదారుడు దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి.
  • బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాలి. తప్పనిసరిగా ప్రభుత్వ బ్యాంకు ఖాతానే ఉండాలి.
  • జన్‌ధన్‌ ఖాతాను ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించరాదు.
  • ఇప్పటికే ఆర్సీసీ చెత్తుతో ఇల్లు ఉన్నా,జీవో 59కింద లబ్ధిపొందినా ఈ పథకం వర్తించదు.

 

Gruhalakshmi scheme full details & Mahalaxmi farm download application process

 

 

 

 

Related Articles

Back to top button