Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS Telangana Gruhalakshmi Scheme Application Form PDF Download 2023

TS Telangana Gruhalakshmi Scheme Application Form PDF Download 2023

 

 

తెలంగాణలో ఇల్లులేని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రభుత్వం రూ. 3 లక్షలు ఆర్థిక సాయం చేస్తుంది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టాలనుకునేవారికి ఈ సాయాన్ని అందించనుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రెండ్రోజుల క్రితం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ శాంతి కుమారి ప్రక్రియను మెుదలు పెట్టాలని సూచించింది. ఈనెల 10 లోపు అఫ్లికేషన్స్ తీసుకోవాలని డెడ్‌లైన్ విధించింది.

 

అర్హులైన వారు దరఖాస్తు ఫారంతో పాటు ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్‌ పేపర్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌, ఆహార భద్రతా కార్డు, బ్యాంకు అకౌంట్ జీరాక్స్ కాఫీలు జత చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎమ్మార్వో, మున్సిపల్, కలెక్టర్‌ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని సీఎస్ సోమవారం ఆదేశించారు. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్లతో పాటు ఈ నెల 10 వరకు వచ్చే దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను ఆగస్టు 20లోగా పూర్తి చేయాలన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రితో ఆమోదం పొందిన లబ్ధిదారులకు 25వ తేదీ నాటికి పథకం మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 

 

 

 

అయితే ప్రభుత్వ నిర్ణయంతో ఆశావాహులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరోజే గడువు ఉండటంతో మీ సేవా కేంద్రాలకు, ఎమ్మార్వో కార్యాలయాలకు పరుగులు తీసుకున్నారు. గడువుపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం తరపున కీలక ప్రకటన చేశారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. ప్రస్తుతం మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు పూర్తయితే.. రెండో దశలో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దశలవారీగా ఇంటి నిర్మాణాల కోసమే ఈ పథకం అమలు చేస్తున్నామని అన్నారు.

 

గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు స్థలాలకు రిజిస్ట్రేషన్ పేపర్లు ఉండవన్న మంత్రి.. ఇంటి నంబర్ ఉన్నా, ఖాళీ స్థలం ఉన్నా సరే అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అప్లికేషన్లను తమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌కు నేరుగా పంపించవచ్చునని చెప్పారు. మొదటి దశ 3 వేల ఇళ్ల నిర్మాణం పూర్తైన తర్వాత.. రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు.

 

Gruhalakshmi scheme form PDF Download

 

Full Details In Video

 

 

 

Related Articles

Back to top button