Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

High Court Junior Assistant Jobs 2025

డిగ్రీ అర్హతతో తెలంగాణ హైకోర్ట్‌ జిల్లా కోర్టుల్లో 340 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు జీతం నెలకు 72,850

 

 

తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర హైకోర్ట్ నుండి జిల్లా కోర్టుల్లో ఏదైనా డిగ్రీ విద్యార్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 02/2025 విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

ఉద్యోగాల సంఖ్య: మొత్తం అన్ని జిల్లాలో ఉన్న కోర్టుల్లో పోస్టులు కలిపి 340 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేయబోయే ఉద్యోగాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యార్హత: ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అర్హులు.

వయస్సు:
18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ,  ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు , దివ్యాంగులుకి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
వయస్సు నిర్ధారణ కొరకు 01/07/2025ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం : అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వార అధికారిక వెబ్సైట్ లో 08-01-2025 నుండి 31-01-2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఈ వ్రాత పరీక్షలో డిగ్రీ అర్హత స్థాయి ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష విధానం:
మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు. అంటే ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్ మార్కులు లేవు.
60 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు జనరల్  ఇంగ్లీష్ నుండి ఇస్తారు.
పరీక్ష సమయం : 120 నిమిషాలు.
పరీక్ష ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో నిర్వహిస్తారు.

క్వాలిఫై మార్కులు: OC మరియు EWS అభ్యర్థులకు 40% మార్కులు, BC అభ్యర్థులకు 35% మార్కులు , ఎస్సీ, ఎస్టీ, PH అభ్యర్థులకు 30% మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు.

అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
ఓసి మరియు బిసి అభ్యర్థులు 600/- రూపాయలు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ , EWS &  దివ్యాంగులు 400/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.

జీతం: వీరికి 24,280/- రూపాయల నుండి 72,850/- రూపాయల పేస్కేల్ వర్తిస్తుంది.

నోటిఫికేషన్ విడుదల అయిన తేది : 02/01/2025 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 08/01/2025 నుండి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో 31/01/205 తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేయాలి.

పరీక్ష తేదీ: ఏప్రిల్ 2025 లో కంప్యూటర్ ఆధారత పరీక్షను నిర్వహిస్తారు.

 

 

 

Related Articles

Back to top button