Modi Government
మహిళలకు శుభవార్త చెప్పిన మోదీ ప్రభుత్వం.. అకౌంట్లోకి రూ.3 లక్షలు..
కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే రైతులకు సంబంధించి పీఎం కిసాన్ యోజన పథకం ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. దీని ద్వారా రైతులు పెట్టుబడి సాయం కింద రూ.6 వేలు సంవత్సరానికి పొందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే రైతులకు సంబంధించి పీఎం కిసాన్ యోజన పథకం ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. దీని ద్వారా రైతులు పెట్టుబడి సాయం కింద రూ.6 వేలు సంవత్సరానికి పొందుతున్నారు.
అంతే కాకుండా.. మహిళలకు కూడా ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. దీనిలో భాగంగా తాజాగా వారి కోసం మరో పథకాన్ని తీసుకొచ్చింది. దాని పేరు ఉద్యోగిని యోజన పథకం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ పథకం వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యాపార పెట్టుబడికి సంబంధించి లోన్ బ్యాంక్ అందజేస్తుంది. దాదాపు రూ.3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.
దీనిలో 30 శాతం కేంద్రం సబ్సిడీ కింద అందజేస్తుంది. దీనికి 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు అర్హులుగా పేర్కొన్నారు. ఈ బ్యాంక్ రుణానికి వారు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి.
కుటుంబ ఆదాయం రూ.1.50 లక్షలకు మించకుండా ఉండాలి. ఒక వేళ ఆ మహిళ వితంతువు, దివ్యాంగురాలు అయితే.. ఎలాంటి ఆదాయ పరిమితి లేదని పేర్కొన్నారు.
ఈ లోన్ కోసం మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఆధార్ కార్డు, బీపీఎల్ కార్డు, కుల ధృవీకరణ పత్రం వంటి పత్రాలను అందించాలి.
ఈ పథకం ద్వారా కాకుండా బయట బ్యాంక్ లోన్ తీసుకుంటే.. తీసుకున్న దాని కంటే కూడా వడ్డీతో పాటు రుణాన్ని ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. కానీ ఈ ఉద్యోగిని పథకంలో అలా కాదు. ఇందులో మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తోంది.
మీ దగ్గర్లోని ఏ బ్యాంక్ లో అయినా రుణాన్ని తీసుకోవచ్చు. దీని కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ఫ్రూప్ లాంటి పత్రాలను బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది.