Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Ration Card EKYC Extension!

రేషన్‌కార్డు ఈకేవైసీ పొడిగింపు!

అర్హులకు సంక్షేమ పథకాలు అందించడానికి సర్కారు పకడ్భందీగా చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా రేషన్‌కార్డులకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. అందుబాటులో ఉన్న రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్లి లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల అధికారులు సూచించారు.

దీంతో స్వగ్రామం, పట్టణాల్లో ఎక్కడి వారు అక్కడ నమోదు చేసుకున్నారు. కానీ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు, విదేశాలకు బతుకుదెరువు కోసం వలస వెళ్లిన వారి ఈ కేవైసీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఇంకా వేలల్లో లబ్ధ్దిదారులు నమోదు చేసుకోలేదు. దీంతో రేషన్‌కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

ముందు ప్రకటించినట్లు ఫిబ్రవరి 29తో గడువు ముగిసింది. కానీ వివిధ కారణాలతో పలువురు ఇంకా కేవైసీ పూర్తి కాకపోవడంతో గడువును పెంచారు. ప్రస్తుతానికి గడువు తేదీ ప్రకటించలేదు. ఎక్కువ మందికి నష్టం జరిగే అవకాశముందని భావించిన ప్రభుత్వం ఈకేవైసీ వెబ్‌సైట్‌ను మూసివేయకుండా అందుబాటులో ఉంచింది. లబ్ధ్దిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Related Articles

Back to top button