Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Ration Cards: గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!

కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దీని వల్ల చాలా మందికి ఊరట లభించనుంది.

 

 

 

 

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. రేషన్ కార్డు లేని వారికి లేదంటే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఇంతకీ రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? ఎవరికి ఊరట లభిస్తుంది? వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్ల కాలంలో రేషన్ కార్డుల జారీ తగ్గిపోయింది. దీంతో చాలా మంది పేదవారు, సామాన్యులు రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ప్రజాపాలనలో ఇప్పటికే దరఖాస్తులతో పాటు రేషన్ కార్డు దరఖాస్తులను కూడా స్వీకరించింది. అంతేకాకుండా కొత్తగా రేషన్ కార్డు కావాలనుకునే వారు మీసేవలో కూడా అప్లై చేసుకోవచ్చని అధికారులు ఇప్పటికే తెలిపారు.

కాగా చాలా మంది మీసేవ ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటున్నారు. ఫిబ్రవరి నెల చివరకు మీసేవ ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత వీరికి ఎప్పుడు రేషన్ కార్డులు జారీ చేస్తారనేది తెలియాల్సి ఉంది.

 

 

ఈ అంశంపై అధికారులను వివరణ కోరితే.. ప్రస్తుతం తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రక్రియ ముగియగానే కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు.

 

మరో వైపు రేషన్ కార్డు కలిగిన వారు ఇ-కేవైసీ చేసుకోవడానికి ఫిబ్రవరి నెల 29 వరకు అవకాశం ఉందని గుర్తించుకోవాలి. అందువల్ల రేషన్ కార్డు వారు కచ్చితంగా ఇ- కేవైసీ పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి రావొచ్చు.

 

 

రేషన్ కార్డు ఇ-కేవైసీ చేసుకోకపోతే.. అప్పుడు అలాంటి రేషన్ కార్డులు క్యాన్సిల్ అవుతాయని చెప్పుకోవచ్చు. అంటే అలాంటి రేషన్ కార్డులు ఇకపై పని చేయకపోవచ్చు. అంటే ఇకేవైసీ డెడ్‌లైన్ అయిపోయిన తర్వాత అంటే మార్చిలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలో తాజాగా రేవంత్ రేషన్ కార్డుల జారీపై స్పందించారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అని మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి తెలిపారు. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగు తుందని చెప్పుకోవచ్చు.

 

 

 

 

 

 

 

 

Related Articles

Back to top button