Andhra PradeshBusinessEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Rythu Bandhu Scheme 2023 || Rythu Bandhu Eligibility, Status Check, Amount 2023

రైతు బంధు కొందరికే..!

 

Rythu Bandhu

 

రైతు బంధు కొందరికే..!

 

పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

 

ఆ పైన రైతుల ఖాతాల్లో పడని నగదు

హనుమకొండ జిల్లాకు రూ.107కోట్లు విడుదల

ఇంకా జమకావలసింది రూ.28కోట్లు

15వేల మంది అన్నదాతల ఎదురుచూపులు

రైతుబంధు కిందకు కొత్తగా 14వేల మంది చేరిక.

 

 

పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నాలుగున్నర ఎకరాలకుపైబడిన అన్నదాతలకు ఇంకా రైతుబంధు సాయం అందలేదు. వీరంతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రైతుబంధు కింద వానాకాలం, యాసంగి సీజన్‌ పంటలకు కలిపి ఏడాదికి ఎకరానికి రూ.10వేల సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. నగదు బదిలీని ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉంది. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడం, ఆర్థికశాఖ నుంచి ట్రెజరీకి నిధులు సమకూరకపోవడంతో ఈ పథకం ముందుకు సాగడం లేదు.

 

 

ఎన్నికల ముందు..

2018 ముందస్తు ఎన్నికల ముందు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. మొదట్లో ఎకరానికి రూ.4వేలు ఇస్తామని చెప్పిన సర్కారు.. ఆ తర్వాత ఎకరానికి రూ.5 వేలు చేసింది. 2020 తర్వాత నుంచి 5నుంచి 10ఎకరాల మధ్య ఉన్న రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించింది. 10 ఎకరాలు పైబడి ఉన్న రైతులు సాధారణంగా ఒకటీ లేదా రెండు నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. గతేడాది జూన్‌ 28 నుంచే అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించారు. జూన్‌ 20వ తేదీ నాటికి పాసు పుస్తకాలు ఉన్నవారికి రిజిస్ట్రేషన్‌ పూర్తయిన రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రభుత్వ సాయం అందించింది. ఈ యేడు ప్రభుత్వం జూన్‌ 26వ తేదీ నుంచి రైతుబంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడం అరంభిం చింది. ఆర ఎకరం మొదలుకొని నాలుగున్నర ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే ఇప్పటివరకు ఎకరానికి రూ.5వేల చొప్పున సాయాన్ని అందచేసింది.

 

 

అందని రూ.28.48కోట్లు

హనుమకొండ జిల్లాలో 2.53లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 1,50,982 మంది రైతులకు రూ.136.08కోట్ల రైతు బంధు సాయాన్ని జమ చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు 1,35,357 మంది రైతులకు రూ.107.59కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందచేసింది. పెట్టుబడి సాయం అందించడం ప్రారంభించి 20రోజులు దాటి పోతున్నా మిగిలిన 15,625 మంది రైతులకు రావల్సిన రూ.28.48కోట్ల సాయాన్ని ఇప్పటికీ ప్రభుత్వం అందించకపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయిదెకరాలకన్నా తక్కువ భూమి ఉన్న రైతులకు రైతుబంధు అందించిన తర్వాత నగదు బదిలీని ప్రభుత్వం నిలిపివేసింది.

 

 

14వేల మంది కొత్త రైతులు

ఈ వానాకాలం సీజన్‌లో కొత్తగా పట్దాదారు పాసు పుస్తకాలు పొందినవారికీ సాయం అందేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రతీ సీజన్‌లో వ్యవసాయ అధికారులు కొత్త రైతుల వెంటపడి మరీ దరఖాస్తు చేయిస్తుంటారు. ఈసారి కూడా అదే చేశారు. రైతుల వివరాలను సేకరించి రైతు బంధు పోర్టల్‌ పొందుపరిచారు. ఇటీవల పోడు పట్టాలుల పొందిన రైతులను కలుపుకొని కొత్తగా 14వేల మంది రైతుల సమాచారాన్ని ప్రభుత్వానికి అందచేశారు. పోడు రైతుల్లో కొందరికి రైతు బంధు సాయం కూడా అందింది. జిల్లాలో పోడు రైతులు 70మందే ఉన్నారు. వీరిలో నాలుగున్న ఎకరాల లోపున్నువారికి రైతు బంధు సాయం అందింది.

 

 

అవసరం

గడిచిన యాసంగిలో చీడపీడలు, తెగుళ్లు, అకాల వర్షాలతో అన్నదాతలకు రావలిసిన దిగుబడులు రాలేదు. పెట్టిన పెట్టుబడి రాక రైతులు నష్టపోయారు. వానాకాలంలో సైతం ఆలస్యం కావడంతో తొలకరిలోనే విత్తనాలు విత్తుకున్నా మొలకెత్తక కష్టం నేలపాలైంది. నైరుతి పవనాలు సకాలంలో వచ్చి ఉంటే ఇప్పటికే రైతులు దుక్కులు దున్ని నార్లు పోసేందుకు సన్నద్ధమయ్యేవారు. 25రోజులు ఆలస్యంగా వర్షాలు కురిశాయి. ఐదురోజులుగా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. చెరువులు, కుంటలు నిండాయి. జలకళను సంతరించుకున్నాయి. దీంతో ఆలస్యంగా అయినా సరే రైతులు ముమ్మరంగా సాగు పనులు చేపట్టారు. జోరుగా నాట్లు పడుతున్నాయి. ఈ సమయంలో రైతులకు రైతు బంధు సాయం ఎంతో అసవరం. రైతులు ఎరువులు, విత్తనాలు కొనడానికి డబ్బులు ఎంతో అవసరం. ప్రస్తుత సీజన్‌లో రావలసిన పెట్టుబడి సాయాన్ని తక్షణమే విడుదల చేయాలని, నాలుగున్నర ఎకరాలు దాటి ఉన్న అన్నదాలు కోరుతున్నారు.

 

 

ఆందోళన వద్దు.. సాయం అందుతుంది..

పెట్టుబడి సాయం విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నాలుగున్నర ఎకరాల వరకున్న రైతులందరికీ రైతుంధు సాయం ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. మిగిలిన వారికి తప్పకుండా అందుతుంది. రైతులందరి ఖాతాలను ట్రెజరీకి పంపించాం. నిధులు విడుదల కాగానే పెట్టుబడి సాయం సంబంధిత బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.

Related Articles

Back to top button