Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Rythu Runamafi 2023

99,999 రూ. లక్షలోపు రుణమాఫీ పూర్తి చేసిన ప్రభుత్వం

 

 

అన్నదాతలకు బ్యాంక్​ అప్పుల నుంచి విముక్తి కల్పించేందుకు.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతు రుణమాఫీ (Farmer Loan Waiver) ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు రూ.99,999 వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. సీఎం కేసీఆర్​ ఆదేశాలు మేరకు.. ఇవాళ ఒక్కరోజే 10.79 లక్షల రైతులకు.. రూ.6,546 కోట్ల Runa Mafi  చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ పథకానికి సంబందించి.. ప్రతి వారం కొంత మొత్తాన్ని జమ చేస్తోన్న రాష్ట్ర సర్కార్.. ఖజానాకు వస్తోన్న ఆదాయం ప్రకారం చెల్లింపులు చేస్తోంది. ఈ మేరకు పన్నేతర ఆదాయంపై కూడా దృష్టి సారించింది. ఏది ఏమైనా సెప్టెంబర్​ రెండో వారంలోగా.. ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

 

మరోవైపు రైతులకు రూ.99,999వరకు రుణామాఫీ చేస్తూ.. సీఎం కేసీఆర్​ (KCR) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఈ మేరకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా.. కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా రైతు సంక్షేమంలో CM KCR ఏనాడు రాజీ పడలేదన్నారు.

 

ఒకే రోజు మొత్తం 9లక్షల2వేల 843 మంది రైతుల ఖాతాలకు రూ.5,809.78 కోట్లు బదిలీ చేసి అత్యధికంగా ఖజానా (Telangana Treasury) ద్వారా చెల్లింపులు చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పిందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని చెప్పేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు నిదర్శనమని హరీశ్​రావు అభిప్రాయపడ్డార

 

 

ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ పాలనలో రైతన్నకు మరో గొప్ప వరం లభించిందని మంత్రి కేటీఆర్​ ట్విటర్​ వేదికగా అన్నారు. ఇవాళ ఒక్కరోజు రూ. 99,999 లోపు పంట రుణం ఉన్న 9.02 లక్షల మంది రైతులకు ఒకేసారి రూ 5,809 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. దేశంలో వరుసగా రెండోసారి ఇంత పెద్ద ఎత్తున రైతు రుణాలను మాఫీ చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు.

 

 

 

Related Articles

Back to top button