Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Tomorrow ‘KCR Vidyabandhu’ 2023-24

రేపు ‘కేసీఆర్‌ విద్యాబంధు’ 2023-24

 

 

 

పథకానికి విద్యాబంధు, కేసీఆర్‌ విద్యాకానుకతో సహా 20 పేర్లు పరిశీలన

పేరు, పూర్తి విధివిధానాలు ఎంహెచ్‌ఆర్‌డీలో 28న ప్రకటన

రూ.150 కోట్ల బడ్జెట్‌తో పథకానికి రూపకల్పన

ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు డైట్, కాస్మెటిక్‌ చార్జీలు

మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడి

 

 

రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు మోసుకొచ్చింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో బీసీ గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువ స్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. కరీంనగర్‌లో మీడియా తో మాట్లాడుతూ  పథకానికి సంబంధించిన వివరాలు తెలిపారు. కేసీఆర్‌ విద్యాకానుక/ కేసీఆర్‌ విద్యాబంధు/ స్వదేశీ విద్యానిధి.. ఇలా దాదాపు 20 పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు.

ఈనెల 28న హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగం(ఎంహెచ్‌ఆర్‌డీ)లో పథకం పేరు, జీవో విడుదల, లోగోతోపాటు విధివిధానాలను ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌ హాజరవుతున్నారని చెప్పారు.

గురుకులాలన్నీ ఒకే గొడుగు కిందకు..: కేవలం స్కూల్‌ వరకు విద్యార్థులకు డైట్, కాస్మెటిక్‌ చార్జీలు చెల్లిస్తే.. సరిపోదని భావించిన కేసీఆర్‌.. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కూడా అవే సౌకర్యాలు కల్పించాలని ఈ కార్య క్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి గంగుల తెలిపారు.…

 

ఈ నిర్ణయంతో 302 హాస్టళ్లలో చదువుకుంటున్న 33, 687 మంది విద్యార్థులకు లబ్ధి చేకూ రుతుందన్నారు. వీరికి డైట్, కాస్మె టిక్‌ చార్జీలతోపాటు నోట్‌బుక్స్, రికా ర్డ్స్, బెడ్‌షీట్లు తదితరాలు అందిస్తా మన్నారు. అదే విధంగా ఐఐటీ, ఐఐ ఎం, ఐఐఎస్‌సీ, ఐఐటీ, ఎయిమ్స్‌తో పాటు అన్ని ప్రముఖ వర్సిటీలు, జాతీయ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామన్నారు.

ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు కూడా చెల్లిసా ్తమని మంత్రి  స్పష్టంచేశారు. అందు కే, గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే నూతన పథ కం ముఖ్యఉద్దేశమని శుక్రవారం విధివిధానాలు వివరిస్తామని తెలి పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవి
శంకర్‌ పాల్గొన్నారు.

 

 

 

Related Articles

Back to top button