TS DSC Answer Key 2024 PDF Download Response Sheet Official Website at tgdsc.aptonline.in Telangana Recruitment
TS DSC Answer Key 2024 PDF Download Response Sheet Official Website at tgdsc.aptonline.in Telangana Recruitment
తెలంగాణ విద్యాశాఖ కార్యాలయం వద్ద జూలై 8వ తేదీన ఉద్రిక్తత నెలకొన్న విషయం తెల్సిందే. టీఎస్ డీఎస్సీని వాయిదా వేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి డీఎస్సీ అభ్యర్థులతో పాటు.. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు.
ఎందుకంటే.. వరుసగా వివిధ పోటీ పరీక్షలు ఉండటంతో చదవడానికి సమయం లేదని చెప్పారు. టెట్‌కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో పూర్తి చేయలేకపోతున్నట్లు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల నియామకాలు పూర్తయ్యే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో టీఎస్ డీఎస్సీ-2024 వాయిదా విద్యాశాఖ స్పందించింది. ఎట్టిపరిస్థితుల్లో డీఎస్సీ పరీక్షలను టైమ్‌టేబుల్ ప్రకారం యథాతథంగా నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఈ పరీక్షలు జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అలాగే జూలై 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి డీఎస్సీ హాల్‌టికెట్లలను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
TGDSC-2024 Exam Schedule :
తొలిరోజు జూలై 18న స్కూల్ అసిస్టెంట్ (సోషల్, ఫిజికల్ సైన్స్) తెలుగు మీడియం పోస్టులకు ఫస్ట్ షిఫ్ట్‌లో, సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. చివరి రోజు ఆగస్టు 5న ఫస్ట్ షిఫ్ట్‌లో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు, సెకండ్ షిఫ్ట్‌లో లాంగ్వేజీ పండిట్ (హిందీ) పోస్టులకు పరీక్ష జరగనుంది.
DSC District Wise Selection List 2024
DSC school SA Subject Wise Answer key 2024
All Subjects DSC Answer key 2024