Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

ts govt jobs 2023-24

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సమాచార శాఖలో ఖాళీల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్

 

 

సమాచార శాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులకు మోక్షం కలిగింది. పోస్టుల భర్తీకీ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1384ను విడుదల చేసింది.

 

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 88 పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. తెలంగాణలోని 33 జిల్లాలకు గాను ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌర సంబంధాల అధికారి, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్లను నియమించనున్నారు.

 

హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సమాచార పౌర సంబంధాల శాఖలో పోస్టులు భర్తీ చేయడం ఇదే తొలిసారి.

 

విద్యుత్ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్(Notification) విడుదల చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. TSSPDCLలో కొత్తగా రిక్రూట్ అయిన 1,362 మంది లైన్ మెన్ లకు నిన్న హైదరాబాదులో జెన్‌కో ఆడిటోరియంలో మంత్రి జగదీశ్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తమ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో విద్యుత్ సంస్థల్లో 35,774 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. అదేవిధంగా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో 10,312, ట్రాన్స్‌కోలో 4403, జెన్‌కోలో 3,689, ఎన్‌పీడీసీఎల్‌లో 4,370 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. ఇక 13 వేల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

అదే విద్యుత్ రంగం సాధించిన విజయాలతోటే ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామిక వేత్తలు తెలంగాణా కు తరలి వస్తున్నారన్నారు. ఇక కొత్తగా నియామకం అయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. గత నోటిఫికేషన్‌లో ఒకే మహిళ ఎంపిక కాగా.. ఈసారి ఆరుగురు కొలువులు సాధించారు. ఎవ‌రైనా విద్యుత్ సంస్థ‌ల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని చెబితే పోలీసుల‌కు ఫిర్యాదు చేసి కేసులు పెట్టాల‌ని టీఎస్ ట్రాన్స్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు సూచించారు.

 

 

 

అలాంటి వ్య‌క్తుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. ఏ ఉద్యోగం అయినా ప‌రీక్ష‌లు, అర్హ‌త‌లు, ఇంట‌ర్వ్యూల ఆధారంగానే వ‌స్తాయ‌ని సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ఏ సమాచారం అయినా.. అధికారిక వెబ్ సైట్లో మాత్రమే పొందుపరుస్తామని.. సైట్ ను ఫాలో అవ్వాలని పేర్కొన్నారు. భర్తీ చేసే పోస్టుల్లో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇటీవల తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దీని నుంచి జూనియర్ లైన్‌మెన్, అసిస్టెంట్ ఇంజనీర్ నియామకాలకు సంబంధించి రెండు నోటిఫికేషన్లు విడుదల అయిన విషయం తెలిసిందే. మొత్తం 1,601 పోస్టులున్నాయి. అందులో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులు 48 కాగా, జూనియర్ లైన్‌మెన్ పోస్టులు 1553. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం జూనియర్ లైన్‌మెన్‌ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు మార్చి 8 నుంచి ప్రారంభం కాగా.. అభ్యర్థులు మార్చి 28 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

 

 

 

 

 

 

 

 

Related Articles

Back to top button