Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS Outsourcing Jobs 2023-24

తెలంగాణ ఔట్ సోర్సింగ్ పోస్టులు.. ఇంటర్ పాసైతే చాలు సొంత ప్రాంతంలో ఉద్యోగం..

 

 

 

ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి మహిళ, శిశువికలాంగులు మరియు వయోవృద్ధుల శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

 

ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి మహిళ, శిశువికలాంగులు మరియు వయోవృద్ధుల శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, మహిళా శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం హైదరాబాద్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో చైల్డ్ హెల్ప్ లైన్ మరియు పిల్లల సహాయ కేంద్రం, రైల్వే స్టేషన్, ఖమ్మం నందు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయుటకు కింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 14 ఖాళీల భర్తీకి చేసింది.

 

CHL ఉద్యోగాలను దరఖాస్తు కు ప్రక్రియ ఆఫ్ లైన్ విధానం ద్వారా జూలై 13, 2023న ప్రారంభమయ్యాయి. జులై 20, 2023న ముగిస్తాయి. ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు CHL Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

 

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులకు 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

 

కేస్ వర్కర్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతిలో ఉత్తీర్ణత ఉండాలి. అంతే కాకుండా.. అభ్యర్థులకు చక్కని సంభాషణా నైపుణ్యం , అనుభవం ఉంటే ఆ అభ్యర్థికి వెయిటేజీ ఇస్తారు.

 

కేస్ వర్కర్, చైల్డ్ లైన్ సూపర్వైజర్స్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయము నుండి B.A ఇన్ సోషల్ వర్క్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనిటీ సోషియాలజీ/ సోషల్ సైన్స్ మరియు అనుభవం గల అభ్యర్థికి వెయిటేజీ ఇస్తారు.

ఎంపిక ప్రక్రియ :

ఈ రిక్రూట్ మెంట్ లో భర్తీ చేసే ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు.

దరఖాస్తు కు ఫీజు :

-జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ. 600

-మిగితా అభ్యర్ధులు – రూ. 300 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు :

నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు ప్రారంభం జులై 15, 2023 నుంచి ప్రారంభం కాగా.. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 13, 2023గా పేర్కొన్నారు.

దరఖాస్తు ఇలా..

-అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.

-దరఖాస్తు పత్రమును సరైన సమాచారం తో తప్పులు లేకుండా నింపండి.

-అవసరమైతే.. దరఖాస్తు రుసుము చెల్లించండి.

-దరఖాస్తుదారులు ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్థి సంతకము చేయాలి.

 

జీతాలు..

ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి.. నెలకు రూ. 28, 000, రూ.18,536, రూ.19,500, రూ.15,600 వేతనం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

 

 

జీతాలు..

ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి.. నెలకు రూ. 28, 000, రూ.18,536, రూ.19,500, రూ.15,600 వేతనం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

 

 

 

TELANGANA OUTSOURCING JOBS DETAILS

 

 

 

 

 

 

 

 

 

Related Articles

Back to top button