Tspsc Released Group 4 For Notification For 9168 Post Here’s Complete Details
Group 4 Notification : 9,168 గ్రూప్ 4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం చేసింది. గ్రూప్ 4లో 9168 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవలే గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా టీఎస్పీఎస్సీ ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేష్ విడుదల చేసింది.
మెుత్తం 9,168 పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరణ ఉంటుంది. టీఎస్పీఎస్పీ అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్ అండ్ వార్డ్ ఆఫీసర్ తదితర పోస్టులను భర్తీ చేస్తారు. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ప్రకటించింది.
గ్రూప్ 4లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖ 1,245 పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలోని గ్రూప్ 2లో 663 పోస్టులు గుర్తిస్తూ.. టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు ఇచ్చింది.
పోస్టుల వివరాలు
అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్ మెంట్-44, యనిమల్ హస్పెండరీ, డెయిరీ డెవలప్ మెంట్ అండ్ ఫిషరీస్-2, బీసీ వెల్ఫేర్-307, కన్స్యూమర్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్ మెంట్-72, ఎనర్జీ డిపార్ట్ మెంట్-2, ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్-23, ఫైనాన్స్-255, జనరల్ అడ్మినిస్ట్రేషన్-5, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్-338, ఉన్నత విద్యాశాఖ-742, హోమ్ డిపార్ట్ మెంట్-133, పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ-7, వ్యవసాయ శాఖ-51, కార్మిక, ఉపాధి కల్పన శాఖ-128, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్-191, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్-2701, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్-1245, ప్లానింగ్ డిపార్ట్ మెంట్-2, రెవెన్యూ-2077, ఎస్సీ డెవలప్ మెంట్-474, సెకండరీ ఎడ్యూకేషన్-97, ట్రాన్స్ పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్-20, ట్రైబల్ వెల్ఫేర్-221, స్త్రీ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ-18, యూత్, టూరిజం, కల్చర్-13
టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి రెండు నోటిఫికేషన్లు(Notifications) విడుదల అయ్యాయి. ఈ రెండు నోటిఫికేషన్లు గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ కు సంబంధించినవి. వీటిలో నాన్ గెజిటెడ్ పోస్టులు(Non Gazetted) 25, గెజిటెడ్(Gazetted) పోస్టుల 32 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు రెండు నోటిఫికేన్లను విడిగా విడుదల చేసింది టీఎస్పీఎస్సీ.
నాన్ గెజిటెడ్ పోస్టులకు దరఖాస్తుల ప్రారంభ తేదీ డిసెంబర్ 07, 2022
దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 28, 2022గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్.. జియాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా మ్యాథమేటిక్స్ లేదా జియాలజీ ఒక సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి..
అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Teacher Jobs-Full Details: టీచర్ ఉద్యోగాలకు రెండు భారీ నోటిఫికేషన్లు.. 13,404 ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం..
\1\6గెజిటెడ్ ఉద్యోగాలు..
గెజిటెట్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 06, 2022 నుంచి ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 27, 2022 వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగనుంది.
పోస్టుల వివరాలిలా..
అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ – 01
అసిస్టెంట్ కెమిస్ట్ – 04
అసిస్టెంట్ జియోఫిజిస్ట్ – 06
అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ – 16
అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ – 05
అర్హతలు..
అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్.. మెటీరియాలజీ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథమేటిక్స్ లేదా అప్లైడ్ మేథమేటిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
అసిస్టెంట్ కెమిస్ట్.. కెమిస్ట్రీ లేదా అప్లైడ్ కెమిస్ట్రీలో డిగ్రీ కలిగి ఉండాలి. లేదా కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన వారు కూడా అర్హులు. వీటితో పాటు.. పీజీ కూడా ఉండాలి.
అసిస్టెంట్ జియోఫిజిస్ట్.. జియో ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్.. జియాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్.. సివిల్ ఇంజనీరింగ్ లో జియోలజీ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి. లేదా హైడ్రాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి..
అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.