Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop NewsTravel

10 Lakh Jobs IN central 2022 కీలక నిర్ణయం.. 18 నెల‌ల్లో 10 లక్షల ఉద్యోగాలు భ‌ర్తీ..?

ఢిల్లీలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. కేంద్ర ఆర్థిక విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.

 

 

 

 

 

రానున్న ఏడాదిన్నరలో దేశంలో 10లక్షల ఉద్యోగాలివ్వాలని భార‌త్‌ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఆర్థికపరమైన నిర్ణయాలు, మంత్రిత్వశాఖల పనితీరుపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించింది. కేంద్ర పథకాల అమలు తీరును సమీక్షించినట్లు సమాచారం.

 

 

18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు ప్రకటించిన ప్రధాని మోదీ
ఇక్కడ మరింత చదవండి.

 

 

మోదీజీ మీరు ఇస్తానన్న ఉద్యోగాలు ఎక్కడ? అని గత కొన్నాళ్లుగా ప్రతిపక్షాలు ప్రధాని మోదీని ఇరుకున పెడుతున్నాయి. దేశంలో నిరుద్యోగ రేటు తారాస్థాయికి చేరడం కూడా మోదీ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఏడాదిన్నరలో 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేపట్టాలని ప్రధాని మోదీ ఆదేశించారు. మిషన్ మోడ్‌లో ఈ నియామక ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏయే శాఖల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయో చూద్దాం.

 

 

  • 2023 డిసెంబర్‌లోగా పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు
  • త్వరితగతిన భర్తీ చేయాలని ప్రధాని మోదీ ఆదేశం
  • రైల్వే, డిఫెన్స్, పోస్టల్ విభాగాల్లో అత్యధిక ఖాళీలు

 

 

 

 

 

 

 

 

చ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలను ఆదేశించారు. మిషన్ మోడ్‌లో ఈ నియామకాలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో ఖాళీల వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం సేకరించిన తర్వాత ప్రధాని మోదీ ఈ మేరకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. 2023 డిసెంబర్‌లోగా 10 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని కేంద్రం డెడ్‌లైన్‌గా పెట్టుకుంది.

 

దేశంలో నిరుద్యోగ రేటు పెరిగిపోతోందని.. మీరు కల్పిస్తామని హామీ ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడ మోదీజీ? అని ప్రతిపక్షాలు పదే పదే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. మీరు ఇస్తామన్న నెలకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పదే పదే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో నోటిఫికేషన్లు పెద్దగా జారీ చేయకపోవడంతో డిగ్రీలు, పీజీలు చదివిన వారు సైతం ఉద్యోగాల కోసం దీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్నారు. దీంతో వారు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తే.. 2024 ఎన్నికల ముందు బీజేపీ పట్ల సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉండటంతో.. ప్రతిపక్షాల నోళ్లు సైతం మూయించొచ్చనే ఉద్దేశంతో ప్రధాని మోదీ 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని సీరియస్‌గా తీసుకున్నారు.

 

నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు నిర్వహించిన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా ఉద్యోగులు, నిరుద్యోగులకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు ఈ ఏడాది మార్చి 24న కార్మిక, ఉపాధి కల్పన శాఖ స్పష్టం చేసింది.

2020 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 8.72 లక్షల ఖాళీలు ఉన్నాయని ఈ ఏడాది ఆరంభంలో కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 40 లక్షలకుపైగా ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 32 లక్షల కంటే తక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

 

శాఖల వారీగా ఖాళీలు ఇలా..?
కేంద్రం ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులేస్తుండటంతో.. ఎక్కువ ఖాళీలు పోస్టల్, డిఫెన్స్ (సివిల్), రైల్వేలు, రెవెన్యూ తదితర విభాగాల్లో ఉండే అవకాశం ఉంది. ఒక్క రైల్వే శాఖలోనే 2.3 లక్షలకుపైగా ఖాళీలు ఉన్నాయని సమాచారం. డిఫెన్స్ (సివిల్) విభాగంలో సుమారు 2.5 లక్షల ఖాళీలు భర్తీ చేసేందుకు అవకాశం ఉంది. పోస్టల్ శాఖలో 90 వేల ఖాళీలు, రెవెన్యూ శాఖలో సుమారు 74 వేల ఖాళీలు ఉన్నాయని తెలుస్తోంది. హోంశాఖలో 10.8 లక్షల పోస్టులు ఉండగా.. అందులో 1.3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగులు రిటైర్ కావడం, కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో.. ఖాళీలు భారీగా పెరిగిపోయాయి.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button