Andhra PradeshNational & InternationalSocialTelanganaTop News

బంగారం కొనే వారికి గుడ్ న్యూస్ ధర 5 వేలకు పైగా తగ్గిన బంగారం కొనే వాళ్ళు ఇప్పుడే కొనండి

The good news for gold buyers is that gold buyers who have dropped the price by more than 5,000 buy now

పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే తీపికబురు. బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. బంగారం ధర వెలవెలబోతే.. వెండి రేటు భారీగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.510 క్షీణించింది. రూ.45,490కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.550 పతనమైంది. దీంతో రేటు రూ.49,630కు క్షీణించింది.

ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.51 శాతం తగ్గుదలతో 1820 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.75 శాతం క్షీణతతో 24.67 డాలర్లకు తగ్గింది.

కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

బంగారం ధర దిగివస్తే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి రూ.5600 పతనమైంది. దీంతో వెండి ధర రూ.65,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button