Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

జీవో 111ను ఎత్తేస్తున్నాం.. కేబినెట్‌ కీలక నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్‌

రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన జీవో 111ను ఎత్తేస్తూ తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కేబినెట్‌ సమావేశం ముగిసిన అనంతరం.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు స్వయంగా ప్రకటించారు.

 

 

 

 

 

జీవో 111ను ఎత్తేస్తున్నాం.. కేబినెట్‌ కీలక నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్‌

రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన జీవో 111ను ఎత్తేస్తూ తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కేబినెట్‌ సమావేశం ముగిసిన అనంతరం.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు స్వయంగా ప్రకటించారు.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ కీల‌క నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఆ నిర్ణయాలను పాత్రికేయ సమావేశంలో స్వయంగా సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. గత హామీ మేరకు జీవో 111ని ఎత్తివేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. సీఎస్‌ ఆధ్వర్యంలో త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు.

 

 

అలాగే మే 20 నుంచి జూన్‌ 5వ తేదీ వరకు ప‌ల్లె, ప‌ట్టణ ప్రగ‌తిని చేప‌ట్టనున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

 

 

► రాష్ట్రంలో ఆరు ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి. అలాగే త్వరలోనే అన్ని యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం మూడున్నర వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇబ్బందులు, ఆరోపణల నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల తరహాలో కామన్‌ బోర్డు ఏర్పాటు చేసి నియామకాల్ని పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

► హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్‌లో రెండు అదనపు టెర్మినల్స్‌ ఏర్పాటునకు గ్రీన్‌సిగ్నల్‌.

 

 

► ఉమ్మడి రాష్ట్రంలో భూగర్భ జలాలపైనే ఆధారపడ్డారు
►వడ్లు కొనడం చేతకాదు అని కేంద్రం చెప్పొచ్చు కదా
►దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సాగు అయ్యింది
►కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉంది
►దేశ రాజధానిలో 13 నెలలపాటు రైతులు ఉద్యమాలు చేశారు
►వ్యవసాయ చట్టాలు తెచ్చి మళ్లీ తోకముడిచింది
►చివరకు దేశ ప్రధాని రైతులకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి
►ఎరువుల దరలను భారీగా పెంచారు
►పనికిమాలిన విద్యుత్‌ సంస్కరణలు ప్రవేశపెట్టారు
►రాష్ట్రాలను దివాళా తీయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది
►బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అనే సిద్ధాంతంతో పనిచేస్తోంది.
►ఆహార భద్రత బాధ్యత నుండి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం
►కేంద్రం బాధ్యతను గుర్తుచేయడం రాష్ట్రంగా మా బాధ్యత
►అందుకే ఢిల్లీ వేదికగా కేంద్రంపై పోరాటం చేశాం
►బ్యాంకులను దివాళా తీయించడమే మోదీ ఘనత
► యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్రమే కొనుగోలు చేస్తుంది
►ధాన్యం కొనుగోలుపై సీఎస్‌ నేతృత్వంలోని సబ్‌ కమిటీ
►రైతులు ఎవరూ కూడా ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మకండి
►రూ. 1960 కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం
►మొత్తం 3,4 రోజుల్లోనే ధాన్యం కొంటాం
►6 ప్రైవేట వర్శిటీలకు కేబినెట్‌ ఆమోదం
►త్వరలోనే అన్ని వర్శిటీల్లో నియామకాలు
►వర్శిటీల్లో 3,500 వరకూ నియామకాలకు నిర్ణయం
►దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది.

 

 

 

తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం

పీఎల్‌స్పెషల్వీడియోలుసినిమాక్రీడలుబిగ్ బాస్ ఓటీటీబిజినెస్ఫ్యామిలీఫోటోలుట్రెండింగ్

తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం
12 Apr, 2022 18:16 IST

 

 

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్‌ భేటీలో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మే 20 నుంచి జూన 5వరకూ పల్లె, పట్టణ ప్రగతి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

 

 

 

యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలుపై 24 గంటల్లో స్పందించాలని ఢిల్లీలో దీక్ష సందర్భంగా కేంద్రానికి గడువు విధించిన కేసీఆర్‌.. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

 

 

TSPSC Group I Recruitment 2022: త్వరలో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ! ఐతే అంతకంటేముందే..

TSPSC Group 1 Recruitment 2022 Notification: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. గ్రూప్‌-1లో 503 పోస్టుల భర్తీకి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన కమిషన్‌ వాటిని క్రోడీకరిస్తోంది. మొత్తం 12 శాఖల నుంచి 19 రకాల పోస్టులకు ప్రతిపాదనలు అందగా.. వాటిలో నాలుగైదు రకాల పోస్టులకు ఆయా విభాగాల నుంచి సవరణ ప్రతిపాదనలు అందాల్సి ఉంది. అవి రాగానే ప్రకటన జారీ చేయాలని కమిషన్‌ భావిస్తోంది. గ్రూప్‌-1లో 503 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతిచ్చిన మరుసటి రోజు నుంచి కమిషన్‌ ఆయా విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. పొరపాట్లకు తావులేకుండా ప్రతిపాదనలను సకాలంలో అందించేందుకు ప్రొఫార్మా సైతం అందించింది. అయినా నాలుగైదు విభాగాల ప్రతిపాదనల తయారీలో సాంకేతిక పొరపాట్లు తలెత్తాయి. వాటిని సవరించాలని కమిషన్‌ సూచించింది. ఆ సమాచారం అందితే త్వరలోనే గ్రూప్‌-1 ప్రకటన జారీ అయ్యే అవకాశాలున్నాయి.

 

 

ఓటీఆర్‌ నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు!
రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం వన్‌టైం రిజిస్ట్రేషన్‌ (OTR)లో సవరణలకు 15 రోజుల క్రితం కమిషన్‌ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కమిషన్‌ వద్ద 25 లక్షల మంది ఓటీఆర్‌ అందుబాటులో ఉండగా.. ఇప్పటివరకు 1.2 లక్షల మంది మాత్రమే సవరించుకున్నారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఓటీఆర్‌ సవరించుకున్న, నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే టీఎస్‌పీఎస్సీ జారీ చేసే ప్రకటనలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ మేరకు ఓటీఆర్‌ సవరించాలని రోజుకు లక్ష మందికి కమిషన్‌ ఈ-మెయిళ్లు పంపిస్తోంది. చివరి నిమిషం వరకు వేచి ఉండటం కన్నా, ముందే సిద్ధం చేసుకోవాలని సూచిస్తోంది. వేసవి సెలవుల్లో పాఠశాలలు మూసివేస్తారని, ఉద్యోగార్థులు బోనఫైడ్‌ సర్టిఫికెట్లు పొందేందుకు ఇబ్బందులు ఉంటాయని.. ఇప్పుడే అవసరమైన సర్టిఫికెట్లు సమకూర్చుకుని, ఓటీఆర్‌లో అప్‌లోడ్‌ చేసుకుంటే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడతాయని అధికారులు సూచించారు.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button