Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

SSC CGL 2022 Notification PDF Out || SSC CGL Apply Online for 20000+ Vacancies

SSC CGL 2022 Important Dates || ssc.gov.in

 

 

 

 

 

భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఈ అర్హతలుంటే చాలు

 

 

 

ఈ ఎగ్జామ్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బీ, గ్రూప్-సీ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన టైర్-1 ఎగ్జామ్‌ను ఏప్రిల్ 2022లో నిర్వహించనున్నారు.

 

 

ప్రధానాంశాలు:

  • ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ 2022 నోటిఫికేషన్‌
  • భారీ సంఖ్యలో గ్రూప్‌-బీ, సీ పోస్టుల భర్తీ
  • జనవరి 23 దరఖాస్తులకు ఆఖరు తేది

 

 

SSC CGL Recruitment: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(CGL) పరీక్షకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ ఎగ్జామ్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బీ, గ్రూప్-సీ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన టైర్-1 ఎగ్జామ్‌ను ఏప్రిల్ 2022లో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
  • అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫసీర్
  • అసిస్టెంట్
  • ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్ ఇన్ కమ్ ట్యాక్స్
  • ఇన్‌స్పెక్టర్‌ (CGST&Central Excise)
  • ఇన్‌స్పెక్టర్‌ (ప్రెవెంటీవ్ ఆఫీసర్)
  • ఇన్‌స్పెక్టర్‌ (ఎగ్జామినర్)
  • అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్
  • సబ్ ఇన్‌స్పెక్టర్‌
  • ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు
  • అసిస్టెంట్/సూపరింటెండ్
  • రీసెర్చ్ అసిస్టెంట్
  • డివిజనల్ అకౌంటెంట్
  • సబ్ ఇన్‌స్పెక్టర్‌
  • జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO)
  • స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2
  • ఆడిటర్
  • అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్
  • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్స్
  • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
  • ట్యాక్స్ అసిస్టెంట్
  • సబ్ ఇన్‌స్పెక్టర్‌

 

ముఖ్య సమాచారం:
విద్యార్హతలు:
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లయ్‌ చేసే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. దీంతో పాటు చార్టెడ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ & మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్స్ లేదా కంపెనీ సెక్రటరీ/ఎంకాం/ఎంబీఏ(ఫైనాన్స్)/బిజినెస్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసి ఉండాలి.
జూనియర్ స్టాటిస్టికల్ పోస్టుకు అప్లయ్‌ చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. ఇంటర్ స్థాయిలో మాథ్స్ సబ్జెక్టుగా ఉండాలి. ఇతర ఖాళీలకు అప్లయ్‌ చేయాలనుకుంటున్న అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి: ఈ ఉద్యోగాలకు అప్లయ్‌ చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18 నుంచి 32 ఏళ్లు ఉండాలి.

 

 

 

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 23, 2021.
  • దరఖాస్తులకు ఆఖరీ తేదీ: జనవరి 23, 2022.
  • ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ: జనవరి 25, 2022.
  • ఆఫ్ లైన్ చలానా జనరేట్ చేయడానికి ఆఖరీ తేదీ: జనవరి 26, 2022.
  • అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెనింగ్‌ తేదీ: 28 జనవరి, 2022.
  • కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (టైర్-1): ఏప్రిల్ 2022

దరఖాస్తు విధానం ఇలా:

  • మొదట అభ్యర్థులు https://ssc.nic.in/ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవాలి
  • దరఖాస్తు సమయంలో రూ.100ను ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాలి

 

 

 

SSC CGL 2022 Notification PDF

 

 

 

SSC CGL 2022 Online Form

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button