Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Anganwadi Jobs 2023-24

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

 

 

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అఽధికారి కె.అనంతలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

 

యలమంచిలి ఐసీడీఎస్‌ పరిధిలో ఒకటి, గొలుగొండ పరిధిలో రెండు అంగన్‌వాడీ కార్యకర్తలు, యలమంచిలి–9, సబ్బవరం, గొలుగొండ, రావికమతం పరిధిల్లో 5 చొప్పున, అనకాపల్లి, నక్కపల్లి పరిధిల్లో 3 చొప్పున, వి.మాడుగుల పరిధిలో 2 మొత్తం 32 ఆయా పోస్టులకు అర్హత గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

 

 

 

ఈ ఏడాది జూలై 1 నాటికి 21 ఏళ్లు నిండి 35 ఏళ్లలోపు వయసున్న, పదోతరగతి ఉత్తీర్ణులైన స్థానిక, వివాహితలు అర్హులన్నారు. వితంతువులు, అనాథలు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.

 

 

అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలు జత పరిచిన దరఖాస్తులను ఈ నెల 29లోగా సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి కార్యాలయానికి అందించాలన్నారు. అర్హులైన వారికి కాల్‌ లెటర్‌ పంపిస్తామని, అందులో పేర్కొన్న తేదీనాడు నిర్దేశిత ప్రదేశంలో జరిగే ఎంపిక ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా సూచించారు. వివరాలకు స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

 

 

 

 

 

 

Related Articles

Back to top button